TS Graduate Elections: ఎన్నికల వేళ ఇదేం పద్ధతి.. జనసేనానిపై తెలంగాణ బీజేపీ నాయకత్వం గుస్సా..

|

Mar 14, 2021 | 4:31 PM

TS Graduate Elections: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పవన్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని బీజేపీ తెలంగాణ..

TS Graduate Elections: ఎన్నికల వేళ ఇదేం పద్ధతి.. జనసేనానిపై తెలంగాణ బీజేపీ నాయకత్వం గుస్సా..
Follow us on

TS Graduate Elections: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై తెలంగాణ బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. పవన్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని బీజేపీ తెలంగాణ నాయకత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్ఎస్‌కు పవన్ మద్దతు తెలుపడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పవన్ ఇలా అనూహ్య రీతిలో నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియదని పేర్కొన్నారు. ఏదేమైనా పవన్ చర్య సరికాదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఇదిలాఉంటే.. అంతకు ముందు తెలంగాణ బీజేపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పదే పదే వాడుకుని వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకే మద్ధతు తెలిపామని, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను కనీసం పట్టించుకోలేదని జనసేనాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగైతే ఇక కష్టమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నాయకుడు, మాజీ ప్రధాని వాణి దేవికే తమ మద్ధతు ఉంటుందని ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణి దేవికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

Also read: Telangana, AP MLC Elections 2021 Live : ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఉదయం ముమ్మరం, మధ్యాహ్నం మందగమనం

AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా

Money Earning: ఇంటర్నెట్ వాడుతారా? మరెందుకు ఆలస్యం ఇంట్లో కూర్చోనే భారీగా డబ్బు సంపాదిండి.. అదెలాగంటే..