Telangana: మరో రాష్ట్రంలో చూపిస్తే రాజీనామా చేస్తా.. అసెంబ్లీ స్పీకర్ పోచారం ఛాలెంజ్!

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. మరే రాష్ట్రంలో చూపించినా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.

Telangana: మరో రాష్ట్రంలో చూపిస్తే రాజీనామా చేస్తా.. అసెంబ్లీ స్పీకర్ పోచారం ఛాలెంజ్!
Pocharam Srinivas Reddy

Updated on: Sep 06, 2021 | 7:09 PM

Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. మరే రాష్ట్రంలో చూపించినా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగినట్లుగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని పోచారం స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు . ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో పదివేల ఇళ్లు మంజూరు అయ్యాయన్నారు. మరో అయిదువేల ఇళ్లను మిగిలిన పేదలందరికి మంజూరు చేస్తానన్నారు. నియోజకవర్గ పరిధిలో సొంత ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యమన్నారు. దేశంలో రెండు వేల రూపాయలు ఆసరా పెన్షన్లుగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న పోచారం.. దాదాపు రూ.12 వేల కోట్ల ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్న పోచారం. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు మీ జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి చేసి, సంక్షేమ పథకాలను అమలుచేసి ఇక్కడ మాట్లాడండి అని హితవు పలికారు.

Read Also….  Buy Now: జేబులు ఖాళీ..క్రెడిట్ కార్డు లేదు..అయినా నచ్చిన వస్తువు సొంతం చేసుకోవచ్చు తెలుసా? ఎలా అంటారా..

BHEL Reecruitment: బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌, సూపర్‌ వైజర్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..