తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో ముందుగా ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం తెలపనున్న సభ్యులు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఇందులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం వంటి వివిధ అంశాలపై ప్రభుత్వ చర్యలపై కౌన్సిల్‌లో చర్చిస్తారు. కౌన్సిల్‌లో చర్చ అనంతరం బీఏసీ సమావేశం ముగుస్తుంది.