AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ.. వ్యూహంతో ఎంట్రీ ఇస్తున్న ప్రతిపక్షాలు..

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ సిద్దమైంది. పూర్తిస్థాయి అజెండాతో సభ నడిపించడానికి స్పీకర్, అధికారులు ప్లాన్ చేశారు.

Telangana Assembly: ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ.. వ్యూహంతో ఎంట్రీ ఇస్తున్న ప్రతిపక్షాలు..
Telangana Assembly
Sanjay Kasula
|

Updated on: Sep 27, 2021 | 9:47 AM

Share

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ సిద్దమైంది. పూర్తిస్థాయి అజెండాతో సభ నడిపించడానికి స్పీకర్, అధికారులు ప్లాన్ చేశారు. ఐటీ శాఖపై స్వల్పకాలిక చర్చతో ప్రభుత్వం చర్చను ప్రారంభించనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ఇవాళ్టి నుంచి ఉదయం 10 గంటలకే మొదలవుతాయి. సభ మొదటి రోజు 11 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా రానున్నారు. ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా రానున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో అనుసరించాల్సిన ఇప్పటికే అధికార విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించాయి. హుజూరాబాద్‌ ఎన్నిక ఉంది కాబట్టి.. దళితబంధు కేంద్రంగా ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అధికార, విపక్షాలు ఇద్దరికీ అదే ఆయుధం అయ్యేలా కనిపిస్తోంది.

ఇప్పటికే సెషన్‌కి సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం. ఆవరణలో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అటు.. అసెంబ్లీ పరిసరాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నిషేధాజ్ఞనలు కూడా అమలులోకి వచ్చాయి.

అసెంబ్లీ ప్రాంగణంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలతో పాటు.. CM KCR, మంత్రులు, సభ్యులు వెళ్లేందుకు వేర్వేరు ప్రవేశ ద్వారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. మరో వైపు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లుల వాటిపై చర్చ జరిగింది. సభ్యులు అడిగే ప్రశ్నలపై ప్రభుత్వ పక్షాన మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు పట్టుబడుతామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ప్రధాన సమస్యలపై సంస్థాగత చర్చలు జరుగాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలపై స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.

అటు.. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులతో CS సోమేష్‌ కుమార్‌ BRK భవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని.. ఆయా శాఖల ఉన్నతాధికారులు సరైన సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై సంబంధిత శాఖల మంత్రులకు ఇచ్చే ఫైల్‌ను రెడీ చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

అటు అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిదిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి ఈ నిషేదాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయి.

కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు(Dalita bandu) చట్టబద్ద‌త కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. వీటితో పాటు మరి కొన్ని ఆర్డినెన్స్‌లకు చట్టబద్దత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us