Telangana Election: ఆరుగురు నేతలు హ్యాట్రిక్ సాధిస్తారా..? కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చేనా..?

ఒకసారి ఎమ్మెల్యేగా గెలవాలంటే సర్వశక్తులు వడ్డాల్సిందే..! కానీ ఆ జిల్లాలోని ఆ ఆరుగురు మాత్రం హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లురుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం కోసం ఎదురు చూస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు ఉన్న ఆ జిల్లాలో హ్యాట్రిక్ సాధ్యమేనా...? అధికార పక్షానికి చెందిన ఆరుగురు హ్యాట్రిక్ విజయాలతో ఆ జిల్లాలో కాంగ్రెస్ కు చెక్ పెడతారా..?

Telangana Election: ఆరుగురు నేతలు హ్యాట్రిక్ సాధిస్తారా..? కాంగ్రెస్ పూర్వ వైభవం వచ్చేనా..?
Brs Vs Congress

Edited By: Balaraju Goud

Updated on: Nov 14, 2023 | 4:27 PM

ఒకసారి ఎమ్మెల్యేగా గెలవాలంటే సర్వశక్తులు వడ్డాల్సిందే..! కానీ ఆ జిల్లాలోని ఆ ఆరుగురు మాత్రం హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లురుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం కోసం ఎదురు చూస్తున్నారు. బలమైన ప్రత్యర్థులు ఉన్న ఆ జిల్లాలో హ్యాట్రిక్ సాధ్యమేనా…? అధికార పక్షానికి చెందిన ఆరుగురు హ్యాట్రిక్ విజయాలతో ఆ జిల్లాలో కాంగ్రెస్ కు చెక్ పెడతారా..? ఇంతకు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు..? ఏ జిల్లాలో హ్యాట్రిక్ కోసం పరుగులు పెడుతున్నారు..? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

తెలంగాణ ఎన్నిక సమరంలో పార్టీలు దూకుడు పెంచాయి. ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమరం సాగిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌కు కీలకంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాను స్వీప్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు వ్యూహాలను రచిస్తున్నారు. కాంగ్రెస్ హేమ హేమీలందరూ ఎన్నికల బరిలో నిలిచారు. మరో వైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు గులాబీ దళం కూడా వ్యూహ, ప్రతి వ్యూహాలను రచిస్తోంది. సిట్టింగ్ లందరికీ బీఆర్ఎస్ అధినేత టికెట్లు ఇవ్వడంతో, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు హ్యాట్రిక్‌ విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి తోపాటు వరుసగా రెండుసార్లు గెలిచిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మూడోసారి ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలన్న లక్ష్యంతో ఆరుగురు ఎమ్మెల్యేలు పక్కా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు

సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు వరుసగా మంత్రి జగదీశ్‌రెడ్డి 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. మరోసారి ఇదే నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలో రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలైన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్ దామోదర్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో దామోదర్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. దీంతో ఇద్దర నేతలు నువ్వా – నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం కోసం మంత్రి జగదీష్ రెడ్డి ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి జరిగిన రెండు ఎన్నికల్లో కూడా తుంగతుర్తి నియోజక వర్గం నుంచి గాదరి కిశోర్‌ 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాదారి కిషోర్ కు.. కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల సామెల్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ కోసం గాదారి కిషోర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక భువనగిరి నుంచి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత 2014, 2018లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మిర్యాలగూడ నుంచి 2014లో కాంగ్రెస్ తరపున 2018లో బీఆర్ఎస్ తరఫున భాస్కరరావు గెలిచారు. మరో స్థానమైన దేవరకొండలో కూడా 2014లో సిపిఐ నుంచి 2018లో బీఆర్ఎస్ తరఫున రవీంద్ర కుమార్ గెలిచారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

భువనగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి పాలైన అనిల్ కుమార్ రెడ్డి ఈసారి గట్టి పోటీని ఇస్తున్నారు. ఆలేరులో కూడా గొంగిడి సునీతతో కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య పోటీ పడుతున్నారు. మిర్యాలగూడలో సెట్టింగ్ ఎమ్మెల్యే భాస్కరరావుతో కాంగ్రెస్ అభ్యర్థిగా బిఎల్ఆర్ తలపడుతున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఎస్టీ నియోజక వర్గమైన దేవరకొండలో కూడా రవీంద్ర కుమార్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా బాలు నాయక్ ఢీ కొడుతున్నారు.
2014లో జరిగిన తొలి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఆరుగురిలో 2018 ఎన్నికల్లో నలుగురు మాత్రం రెండోసారి కూడా గెలిచారు. మళ్లీ ఇపుడు 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం ఆ నలుగురు నేతలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కు కీలకంగా ఉన్న రాజకీయ ఉద్దండులు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తనయుడు జై వీర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా బలమైన ప్రత్యర్థులు ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ ఆరుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

2018 ఎన్నికల్లో 9 స్థానాలను గెలిచిన బీఆర్ఎస్.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో మూడింటిని కూడా తన ఖాతాలో వేసుకొని కాంగ్రెస్ కంచు కోటను గులాబీ కోటగా మార్చింది. ఈ ఎన్నికల్లోనూ ఈ ఆరుగురు నేతలు హ్యాట్రిక్ సాధించడంతో పాటు నల్లగొండ జిల్లాను స్వీప్ చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హేమా హేమీలకు చెక్ పెట్టడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభావం లేకుండా చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఉమ్మడి నల్లగొండ నుంచి ఆరుగురు అధికార పక్షానికి చెందిన నేతలు హ్యాట్రిక్ సాధిస్తారో లేదా కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…