Telangana BJP: తెలంగాణలో స్పీడు పెంచిన కమలం పార్టీ.. జోరుగా ప్రచారం చేస్తున్న కమలదళం..

|

Nov 16, 2023 | 9:30 PM

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో ప్రచారాన్ని స్పీడప్‌ చేసింది కమలం పార్టీ. వ్యూహాలకు పదును పెడుతూ ఆయా నియోజకవర్గాల్లో జోష్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు స్టార్‌ క్యాంపెయినర్లు, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలకు మేలు చేసే హామీలను ప్రకటిస్తామని.. అమిత్ షా మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు.

Telangana BJP: తెలంగాణలో స్పీడు పెంచిన కమలం పార్టీ.. జోరుగా ప్రచారం చేస్తున్న కమలదళం..
Kishan Reddy
Follow us on

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం పూర్తవ్వడంతో ప్రచారాన్ని స్పీడప్‌ చేసింది కమలం పార్టీ. వ్యూహాలకు పదును పెడుతూ ఆయా నియోజకవర్గాల్లో జోష్‌గా ప్రచారం నిర్వహిస్తున్నారు స్టార్‌ క్యాంపెయినర్లు, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ బైక్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలకు మేలు చేసే హామీలను ప్రకటిస్తామని.. అమిత్ షా మేనిఫెస్టో విడుదల చేస్తారని తెలిపారు. ఇక బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌ రోజు రెండు, మూడు సభల్లో పాల్గొంటూ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవాళ కరీంనగర్‌, బిచ్కుంద, పటాన్‌చెరులో ప్రచారం నిర్వహించారు. సుస్థిర పాలన డబుల్ ఇంజిన్‌తోనే సాధ్యమన్నారు బండి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యమన్నారాయన. తెలంగాణలో ఎవరు ఊహించని మెజార్టీ బీజేపీకి వస్తుందని, బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహించారు. వర్గల్‌ మండలం నాచగిరి శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయంలో ప్రత్యేకపూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్‌ను ఓడగొడితేనే గజ్వేల్‌ ప్రజలు బాగుపడతారని ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌. ఈ ఎన్నికల్లో యువత కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసి ఆయన ఉద్యోగం ఊడగొట్టాలని పిలుపునిచ్చారు.

ఈనెల18న తెలంగాణలో అమిత్ షా పర్యటన.. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌‌లో సభలు

మరోవైపు తెలంగాణ దంగల్‌లోకి బీజేపీ అగ్రనేతలను దింపుతోంది కమలం పార్టీ. సకల జనుల సంకల్ప సభ పేరిట ప్రచారాన్ని మరింత హోరెత్తించబోతుంది. ఈనెల 18న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గద్వాల, నల్లగొండ, వరంగల్‌ తూర్పు..మూడు నియోజకవర్గాల్లో సభలో పాల్గొంటారు. ఇక అదేరోజు బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్‌ చేయనున్నారు అమిత్‌షా. 19న జేపీ నడ్డా..తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 25 నుంచి 3 రోజుల పాటు ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

కిషన్ రెడ్డి వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..