Telangana: దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది: కేటీఆర్
బీఆర్‌ఎస్ చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు కేటీఆర్. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారిందని.. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే పరిస్ధితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అన్ని పార్టీల అగ్ర నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా కూకట్‌పల్లి రోడ్ షోలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయన్నారు. దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారిందని.. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ వస్తే పరిస్ధితి కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందన్నారు. చిన్న చిన్న పొరపాట్లను మనసులో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థించకుంటే నష్టపోయేది జనమేనన్నారు కేటీఆర్.
“లక్షలాది మంది ఉపాధి హైదరాబాద్‌ను చెడగొట్టుకుంటే మన వేలితో మన కంటినే పొడుచుకుంటే మనకే నష్టపోయేది మనే. తెలంగాణ అనేది 4కోట్ల ప్రజలుండే కుటుంబం.. చిన్న చిన్న ఎప్పటికి ఉంటాయి. వాటిని మనసులో పెట్టుకుని ప్రభుత్వాన్ని సమర్థించకుంటే నష్టపోయేది మనమే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..