
ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బహదూర్‌పురా అభ్యర్థిని ప్రకటించారు. ఈ నియోజకవర్గం నుంచి మహమ్మద్ ముబీన్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో తొమ్మది స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది.
ఇప్పటి వరకు బహుదూర్‌పురా స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించుతూ మహమ్మద్ ముబీన్ పేరును ఖారారు చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న పాతబస్తీ ప్రాంతంలో పార్టీ పటిష్టతను కాపాడుకోవడంలో బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం ఎఐఎంఐఎంకు ముఖ్యమైన స్థానంగా మిగిలిపోయింది. నియోజకవర్గంలో మొత్తం 3,10,819 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,57,142, మహిళలు 1,53,626, ట్రాన్స్‌జెండర్లు 51 మంది ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, MIM ఈ నియోజకవర్గంలో సులభంగా విజయాలు సాధించింది. మొహమ్మద్ మోజం ఖాన్ రెండు సందర్భాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి కూడా రిపీట్ అవుతుందన్న నమ్మకంతో పార్టీ ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చుతూ కొత్తవారికి అవకాశం కల్పించింది. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠకు తెర దించుతూ మహమ్మద్ ముబీన్ పేరును ఖారారు చేశారు ఎంఐఎం అధినేత అసద్.
Janab Muhammad Mubeen will be the AIMIM Candidate from the Bahadurpura Assembly constituency.
I am thankful to Janab Maozam Khan for serving the people of Bahadurpura constituency as an AIMIM MLA for 3 Terms,and ASIFNAGAR MLA for 1 term.— Asaduddin Owaisi (@asadowaisi) November 9, 2023
టార్గెట్ ఆ ఏడు నియోజకవర్గాలు. అందులో ఒక్క నియోజకవర్గాన్ని ఓడించినా సరే.. పార్టీ మొత్తాన్ని ఓడించినట్టే లెక్క. పాతబస్తీలో ఆ 7 స్థానాలు మజ్లిస్‌కు కంచుకోటలు. ఎంఐఎం అడ్డాలోకి దర్జాగా అడుగుపెట్టినట్టే. అందుకే ఏ పార్టీకి అవకాశం ఇవ్వకుండానే పక్కాగా తమ అభ్యర్థులను నిలబెడుతూ వస్తోంది ఎంఐఎం. ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ఫ్లాన్ చేసింది ఎంఐఎం.
అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకుని హైదరాబాద్ మహానగర పరిధిలో తొమ్మిది సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. చాంద్రాయణగుట్ట, మలక్‌పేట, కార్వాన్, యాకుత్‌పురా, నాంపల్లి, చార్మినార్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. తాజాగా బహదూర్‌పురా నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించింది. ఇక సిట్టింగ్ ఏడు సీట్లతో పాటు గతంలో స్వల్ప తేడాతో ఓడిపోయిన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ పైన ఈసారి ఎంఐఎం ఫోకస్ పెట్టింది.