Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. సినిమా థియేటర్లు మూసివేసే అలోచన లేదు.. ఎందుకంటే..

| Edited By: Team Veegam

Mar 24, 2021 | 5:07 PM

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించారు. స‌భ..

Telangana Assembly Sessions Live Updates: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. సినిమా థియేటర్లు మూసివేసే అలోచన లేదు.. ఎందుకంటే..
Telangana

Telangana Assembly Sessions Live Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై చర్చించే అవకాశం ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు తీవ్రమ‌వుతున్న దృష్ట్యా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాలని స్పీక‌ర్ పోచారం స‌భ్యుల‌కు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కరోనా విషయమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూని ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సినిమా థియేటర్లపై కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా మహమ్మారి పెరుగుతుండటంతో ఇప్పటికే విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేసే అంశంపై సభలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ సినిమా థియేటర్లను మూసివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒక వేళం ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50%) మాత్రమే ఉండేలా నిబంధనలు విధించాలని సూచించింది.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే వరుసగా కొత్త సినిమాలు విడుదల అవుతుండటంతో థియేటర్లు 90శాతంపైగా నిండిపోయితున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందన వైద్య శాఖ చెబుతోంది.

https://www.youtube.com/watch?v=8RsVvt8Nlek

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Mar 2021 01:01 PM (IST)

    థియేటర్లు మూసివేస్తే నష్టాల్లో వెళ్తుంది

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నందున సినిమా థియేటర్లు మూసివేస్తారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడారు. థియేటర్లు మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని అన్నారు. సీట్ల కుదింపుపై ఏ నిర్ణయం తీసుకోలేదు. థియేటర్లు మూసివేస్తే వేలాది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది.

  • 24 Mar 2021 12:58 PM (IST)

    థియేటర్లపై ఆంక్షల్లేవ్‌..

    తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతోంది. అయితే సినిమా థియేటర్ల మూసివేత ఆలోచన లేదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదశ్‌ తెలిపారు. సీట్ల కుదింపుపై కూడా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని అన్నారు.

  • 24 Mar 2021 12:34 PM (IST)

    సభలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏమన్నారంటే..

    ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీలో మౌలిక వసతులను దృష్టిలో ఉంచుకుని 1500 మందికి ప్రవేశాలు కల్పించామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. యూనివర్సిటీ ఏర్పడిన తొలి రోజుల్లోనే 2 వేల మంది విద్యార్థులుకు ప్రవేశం కల్పించామని, కానీ సరిపడ మౌలిక వసతులు లేకపోవడంతో 2010లో వెయ్యి మందికి ప్రవేశాలు

  • 24 Mar 2021 12:30 PM (IST)

    బాసర ఐఐఐటీలో సీట్ల పెంపుపై..

    నిర్మల్‌ జిల్లాలోని బాసర ఐఐఐటీలో సీట్లను పెంచే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో తెలిపారు. బాసర ఐఐఐటీలో సీట్ల పెంపు అంశానికి సంబంధించి స‌భ్యులు అడిగిన ప్రశ్నాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

  • 24 Mar 2021 11:22 AM (IST)

    వైద్య ఆరోగ్యశాఖ నివేదికపై చర్చ

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు సభలో కరోనా కట్టడిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లు కూడా మూసివేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

  • 24 Mar 2021 10:56 AM (IST)

    సినిమా థియేటర్ల బంద్‌పై కీలక నిర్ణయం

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు సమావేశాల్లో కరోనాపై చర్చించనున్నారు. తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు మూసివేస్తున్నట్లు నిన్న ప్రకటించిన ప్రభుత్వం.. సినిమ థియేటర్లు కూడా మూసివేస్తే బాగుంటుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

  • 24 Mar 2021 10:24 AM (IST)

    పలు శాఖలపై చర్చ

    బుధవారం జరిగే సమావేశాల్లో విద్యాశాఖ, వైద్య ఆరోగ్య, పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య సహా వివిధ శాఖల పద్దులకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. అదే విధంగా క్రీడలు, కార్మిక, దేవాదాయ, అటవీ శాఖ, పర్యాటక, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ పరిశ్రమల శాఖల పద్దులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

  • 24 Mar 2021 10:20 AM (IST)

    ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమాశంలో కరోనా కట్టడిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Follow us on