AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పొగ మంచులో రోడ్డు కనిపించక చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు గల్లంతు

వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి వెళుతున్న కారు చెరువులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు...

Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Dec 25, 2023 | 10:45 AM

Share

వికారాబాద్, డిసెంబర్‌ 25: వికారాబాద్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి వెళుతున్న కారు చెరువులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్లతో ఆ వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. అందులో నలుగురు అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్ తో పాటు పూజిత కారులో ఉన్నారు. వీకెండ్‌ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డి పేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకు వెళ్ళింది.

అందులో రఘుకి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితలను సురక్షితంగా రక్షించాడు. గుణశేఖర్ కార్ తో సహా మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం గుణశేఖర్ కోసం పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు. మునిగిన కారును బయటకు తీశారు. కారుకి ఇరువైపులా డ్యామేజ్ లు ఉండడంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢీకొట్టారా అనే అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం శీతాకాలం అవడంతో అనంతగిరి హిల్స్ వద్ద విపరీతమైనటువంటి పొగ మంచు కమ్ముకొని ఉంటుంది. ఈ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోక నేరుగా చెరువులోకి వెళ్లి ఉంటుందని పోలీసులు ప్రాథమకి నిర్ధారణకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లేకుండా పోయినటువంటి గుణశేఖర్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

కారులో ప్రయాణిస్తున్నటువంటి వారంతా స్నేహితులు. పూజిత అనే అమ్మాయి ఇటీవల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది. వీరంతా సాఫ్‌వేర్‌ ఉద్యోగాలతో పాటు బిజినెస్‌లు చేస్తుంటారు. తెల్లవారుజామున మాదాపూర్ నుంచి బయలుదేరిన వీరు ప్రమాదానికి గురయ్యారు. అయితే బస్సు వచ్చి తమ కారు ఢీకొట్టడంతో పొగ మంచులో కనిపించక చెరువులోకి దూసుకెళ్లినట్లు గాయాలు పాలైన స్నేహితురాలు పూజిత చెప్తోంది. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వింటర్ సీజన్లో అనంతగిరి హిల్స్ ను చూసేందుకు విపరీతంగా పబ్లిక్ అక్కడికి వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వచ్చేటువంటి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో నాలుగు పాములు!
3.8 కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత బూడిదలో నాలుగు పాములు!
తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు
తెలంగాణలో భూములకు రికార్డు ధర.. ఎకరం రూ.264 కోట్లు
డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు వింత గిఫ్ట్‌లు
డ్రైయర్ నుంచి రైస్ కుక్కర్ వరకు.. క్రికెటర్లకు వింత గిఫ్ట్‌లు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
AI లవ్‌.. మనిషికి కొత్త తోడు దొరికినట్టేనా?
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
ట్రాఫిక్ రద్దీకి చెక్..త్వరలో అందుబాటులోకి ఎయిర్ టాక్సీలు..
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
సాగు భూమిలో భారీ విద్యుత్ టవర్లు.. రైతుకు నష్టపరిహారం వస్తుందా?
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..