Telangana: యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు.. సీన్‌ కట్ చేస్తే.. కటకటాల వెనక్కి..

|

Nov 18, 2022 | 7:26 PM

మనిషికి ఏ ఆలోచన వచ్చినా వెంటనే చూసేది యూట్యూబ్.. మంచైనా.. చెడైనా సరే దాని నుంచి నేర్చేసుకుంటున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా యూట్యూబ్‌లో సెర్చ్ చేసేస్తున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన కొందరు..

Telangana: యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నారు.. సీన్‌ కట్ చేస్తే.. కటకటాల వెనక్కి..
Task Force Police
Follow us on

మనిషికి ఏ ఆలోచన వచ్చినా వెంటనే చూసేది యూట్యూబ్.. మంచైనా.. చెడైనా సరే దాని నుంచి నేర్చేసుకుంటున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా యూట్యూబ్‌లో సెర్చ్ చేసేస్తున్నారు. తాజాగా వరంగల్‌కు చెందిన కొందరు యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు ఎలా తయారుచేయాలో నేర్చుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి ఆరు లక్షల రూపాయల విలువైన నకిలీ రెండు వేల రూపాయల నోట్లు, కలర్ ప్రింటర్, ఏడు మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు, ఐదుగురు పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడిందన్నారు. వారి ద్వారా దొంగ నోట్లు ముద్రించే విధానాన్ని తెలుసుకున్న నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని, దీంతో నిందితులు నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారన్నారు. యూట్యూబ్ ద్వారా ఓరిజినల్ రెండు వేల రూపాయలు పోలిఉండే కాగితాల గురించి తెలుసుకున్న ఈ ముఠా వాటిని కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలతో పాటు కిరాణ, దుస్తుల దుకాణం, మద్యం బెల్ట్ షాపుల వద్ద చెలామణి చేసేవారని, గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో నకిలీ నోట్లను చెలామణి చేశారని తెలిపారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం తాగుతూ.. జల్సాలు చేసేవారన్నారు.

నవంబర్ 18వ తేదీ శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారీ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారిని విచారించగా మిగతా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..