Telangana: నడిరోడ్డుపై పడగవిప్పి బుసలు కొట్టిన శ్వేతనాగు.. కెమెరాల్లో బంధించిన వాహనదారులు

పర్వతగిరి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై శ్వేతనాగు ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ..సడెన్ గా నడిరోడ్డుపై ప్రత్యక్షం అయ్యింది. అంతేకాదు.. ఆ పాము అదరలేదు, బెదరలేదు.. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Telangana: నడిరోడ్డుపై పడగవిప్పి బుసలు కొట్టిన శ్వేతనాగు.. కెమెరాల్లో బంధించిన వాహనదారులు
Swetha Nagu

Updated on: May 01, 2023 | 11:41 AM

అడవుల్లో ఉండాల్సిన కౄర మృగాలు, విష సర్పాలు జనావాసాల బాట పడుతున్నాయి. ముఖ్యంగా ఎండ వేడి.. అదే సమయంలో హఠాత్తుగా కురిసే వర్షాలతో పాములు పొదల నుంచి బయటకు వస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా నడిరోడ్డుపై నాగుపాము హల్‌చల్‌ చేసింది. రద్దీగా ఉన్న రహదారిపై పడగవిప్పి బుసలు కొడుతూ జనాలను భయాందోళనకు గురిచేసింది. మహబూబాబాద్ జిల్లా… పర్వతగిరి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై శ్వేతనాగు ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ..సడెన్ గా నడిరోడ్డుపై ప్రత్యక్షం అయ్యింది. అంతేకాదు.. ఆ పాము అదరలేదు, బెదరలేదు.. నడిరోడ్డుపై పడగ విప్పి దర్జాగా నిల్చుండి పోయింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

రోడ్డుపై అంత మంది జనం ఉన్నా, వాహనాలు తిరుగుతున్నా.. ఆ సర్పం భయపడలేదు. అక్కడి నుంచి కదల్లేదు. సుమారు గంటపాటు పడగ విప్పి బుసలు కొడుతూనే ఉంది. నడిరోడ్డుపై ప్రత్యక్షమైన శ్వేతనాగును చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. అరుదైన ఆ శ్వేతనాగును తమ కెమెరాల్లో బంధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..