Hyderabad: హాట్ సమ్మర్‌లో చిల్‌ అయ్యే న్యూస్‌.. హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డు లో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ నీరా కేఫ్‌ను బుధవారం (మే3) మంత్రి కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ప్రారంభించ‌నున్నారు.

Hyderabad: హాట్ సమ్మర్‌లో చిల్‌ అయ్యే న్యూస్‌.. హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే?
Neera Cafe
Follow us
Basha Shek

|

Updated on: May 01, 2023 | 11:39 AM

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్‌ ప్రారంభానికి సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున.. నెక్లెస్ రోడ్డు లో సుమారు రూ. 13 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ నీరా కేఫ్‌ను బుధవారం (మే3) మంత్రి కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు ఆదివారం రాత్రి నీరా కేఫ్‌ను తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ఎండీ మ‌నోహ‌ర్‌తో క‌లిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప‌రిశీలించారు. ప్రారంభోత్స‌వ ఏర్పాట్లు మరింత వేగ‌వంతం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నీరాను ప్రాసెస్ చేసి ఈ కేఫ్‌లో విక్రయించనున్నారు. ఏక కాలంలో సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునే విధంగా ఈ కేఫ్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎలాగైతే కళ్లు తాగిన అనుభూతి పొందేందుకు.. కేఫ్‌లో తాటి, ఈత మొద్దుల నమూనాల్లో సీటింగ్‌ అరేంజ్‌మెంట్ చేయడం విశేషం. అలాగే కేఫ్‌ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి కుండలు కట్టి.. అచ్చమైన గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు. ఇక నీరా కేఫ్‌ పైకప్పును కూడా తాటి ఆకు ఆకారంలోనే డిజైన్‌ చేయడం మరో విశేషం.

కాగా రాష్ట్రంలో మొట్ట మొదటి నీరా కేఫ్ ఇదే. ఈ కేఫ్‌లో టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. కేఫ్‌లోని స్టాల్స్‌ నిర్వహించడానికి, నీర ఉత్పత్తి, విక్రయాల కోసం లైసెన్సులను ప్రస్తుతం కేవలం గౌడ సంఘం సభ్యులకు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. గీత కార్మికుల అస్థిత్వానికి ప్రతీకగా ఈ నీరాకేఫ్‌ను పేర్కంటోంది కేసీఆర్‌ సర్కార్‌. ఈ కేఫ్‌ తో గౌడ కులవృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుందన్నది సర్కారు ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నీరా కేఫ్‌ను ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి