స్కేలు తేల్చిన ఫలితం.. టీఆర్ఎస్ అభ్యర్ధికి ఊహించని విజయం..

ఈ అభ్యర్థి గెలుపు చూస్తే.. ఇలా కూడా గెలవొచ్చా అని ఆశ్చర్యపోతారు. అదృష్టం అభ్యర్ధి వెంట ఉంటే.. స్కేల్ సహకారంతో కూడా గెలుస్తాడని కొంపల్లి పురపొరులో తేలిపోయింది. స్కేల్‌తో గెలవడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే. వివారాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కొంపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే ఫలితాల విషయంలో అన్ని వార్డులను ఓటర్లు ఓట్లేసి గెలిపిస్తే… 3వ వార్డు గెలుపు మాత్రం […]

స్కేలు తేల్చిన ఫలితం.. టీఆర్ఎస్ అభ్యర్ధికి ఊహించని విజయం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 26, 2020 | 12:57 PM

ఈ అభ్యర్థి గెలుపు చూస్తే.. ఇలా కూడా గెలవొచ్చా అని ఆశ్చర్యపోతారు. అదృష్టం అభ్యర్ధి వెంట ఉంటే.. స్కేల్ సహకారంతో కూడా గెలుస్తాడని కొంపల్లి పురపొరులో తేలిపోయింది. స్కేల్‌తో గెలవడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే. వివారాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కొంపల్లి పురపాలక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. అయితే ఫలితాల విషయంలో అన్ని వార్డులను ఓటర్లు ఓట్లేసి గెలిపిస్తే… 3వ వార్డు గెలుపు మాత్రం ఓ స్కేల్ నిర్ణయించింది. ఇక్కడ పొటీ చేసిన టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులకిద్దరికీ సమానంగా ఓట్లొచ్చాయి. టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సన్న శ్రీశైలం యాదవ్‌కు.. బీజేపీ నుంచి పోటీలోకి దిగిన మోహన్ రెడ్డికి చెరిసమానంగా 356 ఓట్లు వచ్చాయి. అయితే ఒక ఓటు మాత్రం.. ఇరు పార్టీల సింబల్‌కు మద్య ఉండటంతో అధికారులు దీనిపై తలమునకలయ్యారు. అక్కడ ఉన్న అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించడంతో.. ఆ బ్యాలెట్ పేపరును స్కెల్‌తో కొలిచి.. ఎక్కువ భాగం టీఆర్ఎస్ వైపే ఉండటంతో.. అది టీఆర్ఎస్ ఓటుగా గుర్తించి.. టీఆర్ఎస్ అభ్యర్ది సన్న శ్రీశైలం యాదవ్ గెలిచినట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో.. పోలీసులు ఎంటరై  పరిస్థితిని చక్కదిద్దారు.