Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

|

Sep 20, 2024 | 11:45 AM

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికు ఊరట లభించింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహ మీద ఆధాపడి దాఖలైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణను ప్రభావితం చేశారనడానికి ఆధారాలు, సాక్ష్యాలు లేవు కాబట్టి..

Supreme Court: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Supreme Court
Follow us on

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికు ఊరట లభించింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహ మీద ఆధాపడి దాఖలైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణను ప్రభావితం చేశారనడానికి ఆధారాలు, సాక్ష్యాలు లేవు కాబట్టి.. పిటిషన్‌ను ఈ దశలో ఎంటర్‌టైన్ చేయడం లేదని వెల్లడించింది. ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవు. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. అలాగే ఈ కేసు ప్రాసిక్యూషన్‌లో సీఎం రేవంత్‌ను జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ కూడా ఈ కేసు, ప్రాసిక్యూషన్‌కి సంబంధించి ప్రతివాదిగా ఉన్న రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌కి ఏసీబీ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది. అటు సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రాసిక్యూటర్ పనిచేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని.. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థ ఏసీబీ నేరుగా ఆయన పరిధిలోనే ఉంటుందన్న బీఆర్ఎస్ నేతల తరపున న్యాయవాదులు వాదించగా.. హైకోర్టును మార్చినా సరే.. దర్యాప్తు సంస్థ అదే ఉంటుందని పేర్కొంటూ సుప్రీం కోర్టు జడ్జి ధీటుగా బదులిచ్చారు. ఇక బీఆర్ఎస్ నేతల తరఫున వాదనలు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం, డీఎస్ నాయుడు కోర్టుకు వినిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు పీసీసీ నేత ఫేస్ బుక్ పోస్టును వాదనల్లో ప్రస్తావించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా లేరని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, క్షమాపణలను ధర్మాసనం తీర్పులో ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..