నేటి యువత కాలంతో పోటీపడుతూ.. పరుగులు పెడుతూ జీవించాల్సి వచ్చింది. వాస్తవానికి క్షణం తీరిక లేకుండా ఇల్లు, ఉద్యోగం.. చదువు అంతకు మించి జీవితంలో మారేది లేదన్నట్లు బతికేస్తున్నారు. ముఖ్యంగా నగర వాసులు యాంత్రిక జీవనంతో అలసిపోతున్నారు. దీంతో నగరవాసుల ఆటవిడుపు కోసం.. సరదాగా గడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. భాగ్యనగర వాసులను ఆహ్లాద పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.. యాంత్రికత నుంచి బయటకు వచ్చి.. ఆనందం నింపేందుకు.. ఆహ్లదం పంచేందుకు.. జీవితంలోని కొన్ని గంటలను అయినా మధుర జ్ఞాపకాలుగా మలిచేందుకు ప్రభుత్వం సన్‌డే ఫన్‌డే వంటి ప్రోగ్రాం చేపట్టింది. ఇప్పటికే ఇది నగరవాసుల మనసులను దోచుకుంది. మన్ననలను పొందింది. ఈ ట్యాంక్‌బండ్‌పై ఇవాళ సన్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. సరికొత్త ఆటవిడుపులతో ట్యాంక్‌బండ్‌పై ఇవాళ సన్‌డే ఫన్‌డే నిర్వహిస్తున్నారు అధికారులు. సన్‌డే ఫన్‌డే నిర్వహణపై రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్ ట్విట్టర్‌లో ప్రకటించారు. దీంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఫార్ములా ఈ రేసింగ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి సండే ఫన్‌డే కార్యక్రమాన్ని నిలిపివేశారు. సాయంత్రం సండే ఫన్‌డే కార్యక్రమం కోసం ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పరిసర ప్రాంతాల్లో 4 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఇకపై హుస్సేన్ సాగర్‌లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..