అవతార్ ఈ పేరు తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా యావత్ ప్రపంచాన్ని ఓ ఊపుఊపేసిందీ చిత్రం. పాండోరా అనే అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించింది. ఈ సినిమా ఇంతలా ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురి చేసిందంటే దానికి కారణం ఈ సినిమాలో ఉపయోగించిన వీఎఫ్‌ఎక్స్ కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్లలో కూర్చున్నంతసేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లిన భావన కలిగించింది. అవతార్2 సినిమా కోసం ఎంతో మంది వీఎఫ్‌ఎక్స్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు. అయితే ఈ టీమ్‌లో మన ఆదిలాబాద్‌కు చెందిన కుర్రాడు ఉన్నాడని తెలుసా.? అతని పేరే రాజశేఖర్ భూపతి. అయితే రాజశేఖర్ సాధించిన ఈ ఘనత ఒక్కరోజుల సాధ్యం కాలేదు. దీని వెనకాల ఎంతో ప్రయత్నం ఉంది. ఇంతకీ ఆదిలాబాద్ టూ అవతార్ 2 వరకు సాగిన రాజశేఖర్ సక్సెస్ స్టోరీపై ఓ లుక్కేయండి..
ఆదిలాబాద్‌కు చెందిన రాజశేఖర్ భూపతికి చిన్నతనంలో కార్టూన్స్ అంటే ఎంతో ఆసక్తి ఉండేది. దీంతో పెద్దయ్యాక యానిమేషన్ రంగంలో రాణించాలని కలలు కన్నాడు. అయితే యానిమేషన్ కోర్సు నేర్చుకోవడానికి కుటుంబ పరిస్థితులు అనుకూలించలేవు. ఆర్థికంగా అంత భారాన్ని మోయలేనని డిగ్రీ కోర్సులో చేరాడు. అయితే రాజశేఖర్‌కు మాత్రం యానిమేటర్ కావాలనే కోరిక మాత్రం పోలేదు. ఆ కసితోనే చదువును మధ్యలోనే వదిలేసి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ఇద్దరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ నుంచి యానిమేషన్‌లో లైటింగ్, కంపోజిటింగ్ మెళుకువలను నేర్చుకున్నారు.
ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ యానిమేషన్ నేర్చుకున్నాడు. ఎంతో కష్టానికోర్చి యానిమేషన్‌లో మెలుకవలు నేర్చుకున్నాడు. అనంతరం డిస్క్రీట్ ఆర్ట్స్ అనే సంస్థలో ఎట్టకేలకు ఉద్యోగం సంపాదించాడు. నెలకు కేవలం రూ. 7 వేలు జీతం తీసుకుంటూ మరోవైపు తన డిగ్రీని కొనసాగించాడు. అనంతరం ప్రైమ్ ఫోకస్ వరల్డ్, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థల్లో ఉద్యోగం సాధించాడు. ఈ క్రమంలో యూకేకు చెందిన మూవీంగ్ పిక్చర్ కంపెనే అనే సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఈ సంస్థలో ఉన్నప్పుడు ఆక్వామాన్, క్యాట్స్ వంటి ప్రముఖ ప్రాజెక్ట్‌ల్లో పనిచేశారడు. తర్వాత ఆస్ట్రేలియాలోని వెటా ఎఫ్‌ఎక్స్ అనే సంస్థలో 2022లో చేరాడు. అవతార్2 చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ అందించిన సంస్థల్లో వెటా ఎఫ్‌ఎక్స్ ఒకటి. ఈ టీఎమ్‌లో రాజశేఖర్ కీలక పాత్ర పోషించాడు. ఇలా ఆదిలాబాద్‌లో మొదలైన రాజశేఖర్ ప్రస్థానం అవతార్ 2 వరకు సాగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..