Crime news: పరీక్షలో ఫెయిలవుతానేమోనని ప్రాణం తీసుకుంది.. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది

|

Mar 23, 2022 | 6:39 AM

పరీక్షల భయం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎగ్జామ్ (Exam) బాగా రాయలేదనో, ఫెయిల్ అవుతానోనని, అనుకున్న మెరిట్ సాధించలేదనో.. ఇలా ఎన్నో రకాల కారణాలతో అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నారు. ఒత్తిడిలో విచక్షణ..

Crime news: పరీక్షలో ఫెయిలవుతానేమోనని ప్రాణం తీసుకుంది.. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది
Follow us on

పరీక్షల భయం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. ఎగ్జామ్ (Exam) బాగా రాయలేదనో, ఫెయిల్ అవుతానోనని, అనుకున్న మెరిట్ సాధించలేదనో.. ఇలా ఎన్నో రకాల కారణాలతో అనూహ్య నిర్ణయం తీసుకుంటున్నారు. ఒత్తిడిలో విచక్షణ కోల్పోయి ప్రాణాలు (Suicide) తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. తెలంగాణలోని హనుమకొండ(Hanamkonda) జిల్లా కమలాపూర్‌ కు చెందిన లిఖిత ఓ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవలి సెమిస్టర్‌ పరీక్షలు బాగా రాయలేదని, ఫెయిల్‌ అవుతానేమోనంటూ తల్లిదండ్రులకు చెబుతూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో మార్చి 14న కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన లిఖిత.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. పొలానికి పిచికారీ చేసేందుకు తీసుకొచ్చిన గడ్డి మందు తాగినట్లు తల్లికి చెప్పింది. అప్రమత్తమైన కుటుంబీకులు వెంటనే వాహనంలో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే లిఖిత చనిపోయినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

పరీక్షలనేవి విద్యార్థుల ప్రగతి సూచికలు మాత్రమేనని వారికి తెలియజేయాలి. ఒకసారి ఫెయిల్ అయితే.. మరోసారి పాస్ అవ్వొచ్చనే ధైర్యం వారిలో నింపాలి. అంతే గానీ ప్రాణాలు తీసుకోవడం సరికాదని వివరించారు. అవసరమైతే వారి కదలికలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారిలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేలా మోటివేట్ చేయాలి. ఇంకా వారిలో ఎలాంటి మార్పు రాకపోతే మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read

Raashi Khanna: బొద్దుగా ఉన్నందుకు అలా వెటకారంగా పిలిచేవారు.. బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌ను గుర్తు చేసుకున్న రాశి..

Viral Video: కొంపముంచిన బంతి.. క్యాచ్ పట్టాలనుకుంటే దిమ్మతిరిగిపోయింది.. షాకింగ్ వీడియో వైరల్..

AP Assembly: డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రివిలేజ్ నోటీసులు.. నారాయణ స్వామి ఏమన్నారంటే..?