Telangana: చలికాలంలోనూ చిల్డ్ బీరే.. తెలంగాణలో మందుబాబుల వింత పోకడ

చల్లటి వెదర్‌లో బీరు తాగడానికి ఇంట్రస్ట్ చూపించరు మందుబాబులు.. రమ్ లేదా విస్కీ వైపు ఎక్కువ మక్కువ చూపుతారు. కానీ ఈ సారి తెలంగాణలో.. సీన్ రివర్సయింది. బీర్ల విషయంలో తగ్గేదే లేదు అంటున్నారు మందుబాబులు.

Telangana: చలికాలంలోనూ చిల్డ్ బీరే.. తెలంగాణలో మందుబాబుల వింత పోకడ
Beer
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 12, 2024 | 7:38 PM

చలికాలంలో చల్లటి చలిలో ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని ఓ సినిమా డైలాగ్. తెలంగాణ మద్యం ప్రియులు అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇంత చలిలోనూ చిల్డ్ బీరే కావాలంటున్నారు.  చల్లటి వెదర్‌లో ఓ కూల్ బీర్ తాగడం వెరీ స్పెషల్ అంటున్నారు. మామూలుగా మద్యం అమ్మకాల విషయంలో సీజన్ల వారీగా విస్కీ, బ్రాందీ, బీరు, వోడ్కా సేల్స్ మారుతూ ఉంటాయి. వేసవికాలంలో బీర్లకు యమగిరాకి ఉంటుంది. కొన్ని బ్రాండ్ బీర్లు అయితే దొరకడమే కష్టం.. ఇక చలికాలంలో విస్కీ, బ్రాందీ సేల్స్ విపరీతంగా ఉంటాయి. వర్షాకాలంలో మాత్రం అన్ని రకాల మద్యం అమ్మకాలు దాదాపు ఓకే రకంగా కనిపిస్తాయి. ఇది ఎప్పుడు ఉండే లెక్కే.. కానీ ఈ చలికాలం లెక్క మారింది. గతంతో పోలిస్తే 33% బీర్ల అమ్మకాలు పెరిగాయి. అంతేకాదు విస్కీ, స్కాచ్ అమ్మకాలు తగ్గడం గమనార్హం.

నవంబర్ నెలలో 40 లక్షల 48 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. కానీ 27 లక్షల 17వేల కేసుల లిక్కర్ మాత్రమే సేల్ అయింది. లిక్కర్‌తో పోలిస్తే 13 లక్షల 30 వేల కేసులు బీర్లు ఎక్కువ తాగేశారు మద్యం ప్రియులు.  గత ఏడాది ఇదే సీజన్లో 27 లక్షల కేసుల బీర్ బాటిల్స్ మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే 33 శాతం బీర్ల అమ్మకాలు ఈ ఏడాది పెరిగాయి. ఇందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఈ చలికాలం అనుకున్నంత టెంపరేచర్లు పడిపోకపోవడం… వింటర్ సీజన్ కూడా ఆలస్యంగా ప్రారంభం కావడం.. వాటితోపాటు బీర్లలో రకరకాల కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి రావడం.. బీర్ల సేల్స్ పెరగడానికి రీజన్స్‌గా చెప్పకోవచ్చు.

మొత్తం రాష్ట్రంలో తయారవుతున్నవి ఆరు రకాల బీర్లు. ఇవి కాక తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి సప్లై అవుతున్నవి 65 రకాలు. దాదాపుగా దేశంలో దొరికే ప్రతి బీర్ బ్రాండ్ తెలంగాణలో కూడా దొరుకుతుంది. ప్రీమియం బీర్లు కూడా ఈ మధ్య మన మార్కెట్లోకి వచ్చాయి. దీంతో ఓసారి టేస్ట్ చూద్దామని బీర్ తాగుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. అందుకే బీర్ సేల్స్ పెరిగినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న బస్సు ప్రమాద దృశ్యాలు..!
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
తగ్గేదేలే.. పుష్ప2 థ్యాంకూ ఇండియా ప్రెస్‌మీట్.. లైవ్ వీడియో
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..