బాత్రూమ్‌లో మొబైల్ వాడుతున్నారా ?? అయితే దీని బారి
న పడటం పక్క
Phani CH
11 December 2024
ఈ కాలంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఫోను వాడకం ఎక్కువ అయిపోయింది.. కొంతమంది బాత్రూమ్స్‌లో కూడా వాడుతుంటారు.
బాత్రూమ్స్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లి వారికి తెలియకుండానే టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మొబైల్ చూస్తూ టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడిపినట్లయితే, మల కండరాలు బలహీనపడతాయట.. భవిష్యత్తులో హెమోరాయిడ్స్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
మొబైల్ చూస్తూ టాయిలెట్‌లో ఎక్కువ సేపు గడపడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి.
గంటల తరబడి టాయిలెట్ సీటుపై కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల కండరాలపై అదనపు ఒత్తిడి పెరిగి పైల్స్, అవాంఛిత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
టాయిలెట్ లో ఎక్కువ సమయం గడిపేవారికి గుండె, కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరం యొక్క సాధారణగ పని చేయాలంటే తక్కువ సమయం టాయిలెట్ ఉపయోగించండి.
టాయిలెట్ లో కూర్చుని మొబైల్ వాడకం తగ్గిస్తే అనేక రోగాల నుండి బయట పడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
నడుము అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తున్న రాశి సింగ్
తస్సాదియ్యా.. అదరగొట్టిన హన్సిక లేటెస్ట్ అవుట్‌ఫిట్ పిక్స్
రాత్రి సమయంలో ఈ లక్షణాలు ఉన్నాయా ?? హార్ట్ ఎటాక్ రావచ్చు జర భద్రం