Jabardasth Yadamma Raju: ‘బిడ్డపై ఆశలుపెట్టుకోవద్దన్నారు’.. తండ్రైన జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య స్టెల్లా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను యాదమ్మ రాజు సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు.
ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు తండ్రయ్యాడు. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు యాదమ్మ రాజు దంపతులు. ఈ మేరకు తమ యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను పంచుకున్నారు. దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలాగే స్టెల్లాకు ప్రసవ సమయంలో పలు సమస్యలు తలెత్తాయట. అందుకే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ వారు తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు ఇందులో స్టెల్లా మాట్లాడుతూ.. ‘ నార్మల్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా ప్రసవం చేయాలన్నారు. దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలన్నారు. అప్పటికీ కూడా కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం’
‘మాకు తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. అక్కడ కూడా బిడ్డ గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నారు. ఈ కారణంగానే సీమంతం ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డెలివరీ డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే ప్రసవం జరిగింది. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగా ఉంది’ అని స్టెల్లా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
మెటర్నిటీ ఫొటోషూట్ లో స్టెల్లా, యాదమ్మ రాజు..
View this post on Instagram
కాగా యాదమ్మ రాజు సుమారు ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్‌ని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్.
15 రోజుల ముందే ప్రసవమైంది.. స్టెల్లా ఎమోషనల్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.