12 December 2024
Pic credit - Social Media
TV9 Telugu
విటమిన్లు , ఖనిజాలతో సహా అనేక పోషకాలు పాలలో ఉన్నాయి. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలుని సంపూర్ణ ఆహారం అని కూడా అంటారు
దాల్చినచెక్క, యాలకులు, మిరియాల వంటి అనేక సుగంధ ద్రవ్యాలతో పాలను తాగుతారు. అదే విధంగా పాలులో సోంపుని కూడా తాగవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
పాలలో సోంపు కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ అంటున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.
కడుపులో గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సోంపు పాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
సోంపులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి. సోంపు కలిపిన పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఎవరైనా బరువు తగ్గాలనుకున్నా.. ఊబకాయం నియంత్రించుకోవాలనుకున్నా సోంపు పాలు తాగండి. ఈ పాలు తాగడం వలన ఊబకాయం రాదు
అంతేకాదు మెరిసే చర్మాన్ని పొందడానికి సహజమైన , ఇంట్లో చేసే సింపుల్ టిప్ గా సోంపు పాలను త్రాగవచ్చు.