
Shocking Video: సాధారణంగా జనాలు చిన్న చిన్న వాటికే హడలిపోతుంటారు. బొద్దింక, బల్లి వంటి చిన్న జీవులు సడన్‌గా కనిపిస్తేనే షాక్ అవుతారు. అలాంటిది ఒక పాము మనకు సమీపిస్తే.. ఇంకేమైనా ఉందా? గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి పరిస్థితినే ఓ వ్యక్తి ఎదుర్కొన్నాడు. తాను నిత్యం ప్రయాణించే స్కూటీలోంచి వింత శబ్ధాలు వస్తుంటే.. ఏంటో అనుకుని భయపడ్డాడు. అలా భయం భయంగానే ఆ స్కూటీ డిక్కీని ఓపెన్ చేసి చూశాడు. అందులో భారీ నాగుపాము నక్కి ఉండటం గమనించి హడలిపోయాడు. వెంటనే అటూ ఇటూ పరుగులు తీశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఈ పూర్తి కథనంలో తెలుసుకుందాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళల్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో పోచయ్య అనే రైతుకు స్కూటీ ఉంది. ఈ స్కూటీపేను అతను రోజూ తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటాడు. రోజూ లాగే ఇవాళ కూడా తన స్కూటీపై పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు పోచయ్య. స్కూటీని ఇంట్లోంచి బయటకు తీశాడు. ఈ క్రమంలో స్కూటీలోంచి వింత శబ్ధాలు రావడాన్ని గమనించాడు. బుస్ బుస్ మంటూ శబ్ధాలు వస్తున్నాయి. దాంతో ఆ పోచయ్య కాస్త టెన్షన్ పడ్డాడు. బైక్ వీల్స్‌లో, చక్రంపైన ఏమైనా దూరిందా అని అనుమానంతో పరిశీలించాడు. కానీ ఏమీ లేదు. మరోవైపు బైక్ నుంచి వింత శబ్ధాలు వస్తూనే ఉన్నాయి. స్కూటీ డిక్కీలో ఏమైనా ఉండొచ్చు అని భావించాడు. స్కూటీని బయటకు తీసుకువచ్చి మెల్లగా డిక్కీని ఓపెన్ చేశాడు. అతని అనుమానమే నిజమైంది. ఆ డిక్కీలో నాగుపాము దాగి ఉంది. అది చూసి పోచయ్య బెంబేలెత్తిపోయాడు. అటూ ఇటూ తిరుగుతూ చుట్టుపక్కన వారిని పిలిచాడు. స్థానికులు వచ్చి.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్ ధీరేందర్‌కి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ధీరేందర్.. ఘటనా స్థలానికి చేరుకుని స్కూటీ డిక్కీ నుంచి నాగు పామును బయటకు తీశాడు. దానికి ఒక బాటిల్‌లో బంధించి.. ఆ తరువాత అడవిలో వదిలి పెట్టారు.
Also read: Revanth Reddy Live Video: సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ రెడ్డి దీక్ష..!దళిత ఆత్మగౌరవ దీక్ష ఏమైయెను..?
Sea Level Rise: అంతర్వేదిలో సముద్రం ఉగ్రరూపం.. 45 మీటర్ల మేర ముందుకు.. ఆందోళనలో గ్రామస్థులు
Drugs Case: అవును.. రాగిణి, సంజనాలు డ్రగ్స్ తీసుకున్నారు.. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులో సంచలన విషయాలు.
మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!