Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Third Wave: విద్యాసంస్థల రీఓపెనింగ్‌కు థర్డ్ వేవ్ టెన్షన్.. అయినా అదొక్కటే ఊరట..!

ప్రభుత్వాల ఆదేశాలు బాగానే వున్నా.. పేరెంట్స్‌లో మాత్రం ఆందోళన వినిపిస్తూనే వుంది. ఎందుకంటే.. గతంలో రెండు వేవ్‌ల తర్వాత వ్యాపార సంస్థలు, మల్టిప్లెక్సులు వంటి వాటిని తెరుచుకునే వెసులుబాటు కల్పించినపుడు కూడా సరిగ్గా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. కానీ ప్రస్తుతం ఎక్కడా...

Corona Third Wave: విద్యాసంస్థల రీఓపెనింగ్‌కు థర్డ్ వేవ్ టెన్షన్.. అయినా అదొక్కటే ఊరట..!
Schools + Students + Corona Virus
Follow us
Rajesh Sharma

| Edited By: Anil kumar poka

Updated on: Aug 24, 2021 | 5:08 PM

Corona Third wave tension across India:  ఓవైపు కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ కొనసాగుతుండడం.. అక్టోబర్ (OCTOBER) నెలలో థర్డ్ వేవ్ పీక్ లెవెల్‌కి చేరుకుంటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ (TELANGANA)లో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని నిర్ణయించడంపై విద్యార్థుల పేరెంట్స్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర కాలంగా కరోనా (CORONA) మహిమతో తరగతి గదులకు దూరమైన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలతో పాఠశాలలను తెరవాలని నిర్ణయిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆఫ్‌లైన్ తరగతులు (OFFLINE CLASSES) ప్రారంభం కాగా.. తెలుగు రాష్ట్రాల్ (TELUGU STATES)లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోబోతున్నాయి. ఆగస్టు 23న సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CHIEF MINISTER K CHANDRASHEKHAR RAO).. చివరికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం (CM) ఆదేశాలకు అనుగుణంగా నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. అయితే. థర్డ్ వేవ్ టెన్షన్.. డెల్టా ప్లస్ వేరియంట్ (DELTA PLUS VARIANT) భయాందోళన కొనసాగుతుండడంతో విద్యాసంస్థల్లో ఏ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటారు అనే విషయంలో పలు సందేహాలు వినిపిస్తున్నాయి.

నిజానికి థర్డ్ వేవ్ ప్రస్తావన వచ్చినప్పటి నుంచి పిల్లలపై అది ప్రభావం చూపుతుందన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే పలు చర్యలు తీసుకున్నారు కూడా. కేంద్ర ఆరోగ్య శాఖ (UNION HEALTH MINISTRY) సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లోని పిల్లల ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఐసీయు, కరోనా బెడ్లు అందబాటులోకి తెచ్చారు. తీసుకున్న చర్యలు సరిపోవన్న అభిప్రాయాలు ఓ వైపు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం థర్డ్ వేవ్‌ని ఎదుర్కొంటామని ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్నాయి. ఈ మేరకు తగిన చర్యల్లో దాదాపు 80 శాతం ఈపాటికే తీసేసుకున్నామని అంటున్నాయి. తాజాగా తెలంగాణలో విద్యాసంస్థలను తెరవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. విద్యాశాఖాధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరు విధిగా మాస్కు ధరించేలా చూడాలని ఆదేశించారు. ఆగస్టు 30వ తేదీలోగా అన్ని విద్యాసంస్థల్లో అనువణువు శానిటైజ్ చేయాలని నిర్దేశించారు. విద్యాసంస్థలు ప్రారంభమైన తర్వాత కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వాల ఆదేశాలు బాగానే వున్నా.. పేరెంట్స్‌లో మాత్రం ఆందోళన వినిపిస్తూనే వుంది. ఎందుకంటే.. గతంలో రెండు వేవ్‌ల తర్వాత వ్యాపార సంస్థలు, మల్టిప్లెక్సులు వంటి వాటిని తెరుచుకునే వెసులుబాటు కల్పించినపుడు కూడా సరిగ్గా ఇలాంటి ఆదేశాలే జారీ చేశారు. కానీ ప్రస్తుతం ఎక్కడా కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తున్న పరిస్థితి లేదు. మాస్కులు ధరించే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. మెట్రో రైళ్ళలోను, సిటీ బస్సుల్లోను భౌతిక దూరం పాటించడం ఎప్పుడో మానేశారు. థియేటర్లలో వందశాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో విద్యాసంస్థల్లోను కోవిడ్ నిబంధనలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థర్ద్ వేవ్‌లో కరోనా వైరస్ పిల్లలపైనే ప్రభావం చూపుతుందన్న భయాందోళన నేపథ్యంలో విద్యాసంస్థల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం వుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని పలువురు సూచిస్తున్నారు. మూడు నుంచి అయిదేళ్ళ పిల్లలు చదువుకునే అంగన్ వాడీలను సైతం తెరిచేందుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలో చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాలకు పంపుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వుండడంతో విద్యాసంస్థలను నిస్సంకోచంగా తెరవ వచ్చన్న అధికారుల నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనికి భిన్నంగా సెప్టెంబర్‌లో దేశంలో కరోనా కేసులు రోజు సగటున 5 లక్షల చొప్పున నమోదయ్యే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అంఛనా వేస్తోంది. ప్రస్తుతం కేసులు తగ్గుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల రీఓపెన్ నిర్ణయాన్ని స్వాగతించాలా లేక రోజుకు ఏవరేజ్‌గా అయిదు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే గడ్డు రోజులు ముందున్నాయని భయపడాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నందున ప్రాణాపాయం వుండకపోవచ్చన్న ఓ విశ్వాసం పలువురికి కాస్తైనా ఊరట కలిగిస్తోంది.