Hyderabad: తేడాగా కనిపించిన బాత్‌రూమ్ పైపులు.. చెక్ చేసిన చూసిన పోలీసులు షాక్..!
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ధూల్‌పేట్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 2.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. బుధవారం ఎస్టీఎఫ్ టీమ్-ఏతో పాటు ధూల్‌పేట్ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటి బాత్‌రూమ్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఎక్సైజ్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ధూల్‌పేట్ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 2.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. బుధవారం ఎస్టీఎఫ్ టీమ్-ఏతో పాటు ధూల్‌పేట్ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటి బాత్‌రూమ్‌లో అత్యంత చాకచక్యంగా దాచిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ధూల్‌పేట్ పరిధిలోని మచిలీపుర ప్రాంతానికి చెందిన రోహిత్ సింగ్ నివాసంలో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్ టీం ఈ తనిఖీలు చేపట్టారు. మొదట ఇంట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. తిరిగి వెళ్తుండగా బాత్‌రూమ్‌లోని పీవీసీ డ్రైనేజ్ పైపు నుంచి వేలాడుతున్న దారంపై అధికారులకు అనుమానం వచ్చింది. ఆ దారాన్ని గట్టిగా లాగారు. దీంతో పైపు లోపల దాచిన గంజాయి బయటపడింది. అదే విధంగా మరో పైపులోనూ చిన్న ప్యాకెట్లలో గంజాయి దాచినట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో మొత్తం 2.936 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రోహిత్ సింగ్‌తో పాటు అతని భార్య వీనా బాయి ఇంట్లో ఈ మత్తు పదార్థాలు దాచినట్లు నిర్ధారించారు.
ఈ కేసులో రోహిత్ సింగ్, రోహన్ సింగ్, వీనా బాయిలను అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ అధికారులు వెల్లడించారు. అయితే, ఈ గంజాయి సరఫరాలో కీలకంగా ఉన్న మరో నిందితుడు సంతోష్ సింగ్, అతని భార్య నంది సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపింది. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అలాగే, పురానాపూల్ రోడ్‌లోని మాధవ్ సింగ్ ఇంట్లోనూ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఒక్క ఒకటిన్నర కేజీకి పైగా గంజాయి దొరికింది. ఆటోలో తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మాధవ్‌సింగ్ తోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. ధూల్‌పేట్ ప్రాంతంలో డ్రగ్స్ దందాను పూర్తిగా అణిచి వేస్తామని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు.
మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు. డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొనే వారిపై ఎటువంటి సడలింపులు ఉండవని స్పష్టం చేస్తూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉన్నవారు పోలీసులకు లేదా ఎక్సైజ్ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
