Asaduddin Owaisi: 2015 నాటి కేసు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్..

|

Jan 25, 2021 | 3:05 PM

Asaduddin Owaisi: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకు నాన్ బెయిలబుల్..

Asaduddin Owaisi: 2015 నాటి కేసు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్..
Asaduddin Owaisi
Follow us on

Asaduddin Owaisi: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై దాడి కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకాకపోవడం వల్లే ప్రత్యేక కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా, 2015లో మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అనంతరం కారులో తిరుగు పయనం అయ్యారు. ఆ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డగించారు. మరికొందరైతే కారులో కూర్చున్న షబ్బీర్ అలీపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా అక్కడే ఉన్నారు.

కాగా, తనపై జరిగిన దాడిని నిరసిస్తూ షబ్బీర్ అలీ మీర్‌చౌక్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ ఘటనకు బాధ్యుడిగా అసదుద్దీన్‌ను చేర్చారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దానిపై విచారించిన ధర్మాసనం.. ఆయనను విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. అయితే, ఆయన కోర్టుకు హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన ధర్మాసనం.. తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Also read:

ఎవరి కోసం ఈ ఎన్నికలు..? ప్రజల ప్రాణాలను నిమ్మగడ్డ ఫణంగా పెడుతున్నారన్న ఎంపీ బాలశౌరి

Salaar Movie Update: ‘సలార్’ షూటింగ్ షూరు చేయనున్న ప్రభాస్.. మొదటి షెడ్యూల్ ఎక్కడంటే ?