Monsoon: తెలంగాణలో రుతుపవనాలు అప్పుడే వస్తాయ్.. రైతులకు కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ

నైరుతి రుతపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. అయితే ఇప్పుడు రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Monsoon: తెలంగాణలో రుతుపవనాలు అప్పుడే వస్తాయ్.. రైతులకు కీలక సూచనలు చేసిన వాతావరణ శాఖ
Monsoon

Updated on: Jun 15, 2023 | 1:57 PM

నైరుతి రుతపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమవుతోంది. రెండ్రోజుల క్రితం రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. మెుదటగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకగా.. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. అయితే ఇప్పుడు రుతపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారం రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తరించనుండగా..ఆ తర్వాత తెలంగాణను కూడా తాకనున్నాయని చెప్పారు. అయితే ఈ నెల 18వ లోపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని అధికారులు తెలిపారు. అనంతంరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి మరింత సమయం పడుతుందని చెప్పారు.

రుతుపవనాల ఆలస్యంతో మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కుమురంభీం సహా పలు జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. అలాగే ఇవాళ, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. బుధవారం అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా తంగులలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు కాగా మెదక్‌లో కనిష్టంగా 25.2 డిగ్రీ సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

అలాగే రుతు పవనాల రాక ఆలస్యం కావటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తొందరపడి విత్తనాలు విత్తుకోవద్దని సూచిస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకిన తర్వాతే విత్తనాలు వేయటం మంచిదని చెబుతున్నారు. ఈనెల 18న రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉన్నందున సరిపడ వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..