South Central Railway: దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!

| Edited By: Balaraju Goud

Jul 18, 2024 | 12:24 PM

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - నడికుడి మార్గం ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్. ఈ మార్గంలో నడిచే ముఖ్యమైన రైళ్లకు కొన్ని స్టేషన్లలో హాల్ట్‌ను ఎత్తివేసింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించే మూడు కీలక రైళ్ల స్టాప్‌లు ఎత్తివేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే సంచలన నిర్ణయం.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..!
Railway
Follow us on

దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – నడికుడి మార్గం ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్. ఈ మార్గంలో నడిచే ముఖ్యమైన రైళ్లకు కొన్ని స్టేషన్లలో హాల్ట్‌ను ఎత్తివేసింది దక్షిణ మధ్య రైల్వే. తెలుగు రాష్ట్రాల మధ్య ఎక్కువ దూరం ప్రయాణించే మూడు కీలక రైళ్ల స్టాప్‌లు ఎత్తివేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

రేపటి నుండి మూడు రైళ్ల ‌స్టాప్‌లు ఎత్తివేత..

సికింద్రాబాద్ – నడికుడి రైలు మార్గంలో ముఖ్యమైన మూడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్ట్ ను ఎత్తి వేశారు. రేపటి నుండి విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లు.. మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగకుండానే వెళ్లిపోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే నారాయాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలకు కీలకమైన మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ ఎత్తివేయడంతో ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఈ ప్రాంతాల నుంచి నిత్యం తిరుపతి వెళ్లే భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ ప్రాంతం నుంచి తిరుపతి వెళ్లాలంటే ఉన్న ఏకైక రైలు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే. ఈ రైలుకు వరుసగా మూడు కీలక హాల్ట్‌లు ఎత్తివేయడంతో ఈ ప్రాంత ప్రజలంతా ఇటు నల్గొండ గానీ.. అటు గుంటూరు గానీ వెళ్లాల్సిందే. ఇక విశాఖ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు అయితే ఏకంగా నల్గొండ హాల్ట్‌ ను కూడా ఎత్తివేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌‌లో బయలుదేరితే నేరుగా గుంటూరులోనే ఆగనుంది. అటు చెన్నై మార్గంలో వెళ్లేవారికి కూడా ఇబ్బందులు తప్పవు..! చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ మూడు హాల్టులు ఎత్తివేశారు. ఈ రైలు సికింద్రాబాద్‌ లో బయలుదేరితే ఇక నేరుగా గుంటూరులోనే ఆగనుంది. అటు చెన్నై మార్గంలో వెళ్లేవారికి కూడా ఇబ్బందులు తప్పవు. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ మూడు హాల్టులు ఎత్తివేశారు.

కరోనా సమయంలోనే నిర్ణయం..!

దేశవ్యాప్తంగా కరోనా విజృంభించిన సమయంలో పలు రైళ్ల రాకపోకలు, హాల్టులపై రైల్వే శాఖ తీవ్రమైన ఆంక్షలను విధించింది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ పలు రైళ్లకు హాల్టులను ఎత్తివేసింది. అప్పుడు ఈ మూడు రైళ్లకు ఈ మూడు హాల్టులు కూడా ఎత్తివేశారు. దీంతో రెండు ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆందోళన చేయడంతో అప్పటి ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్వయంగా రైల్వే బోర్డు అధికారులతో చర్చించారు. ఏడాది క్రితం ఈ మూడు రైళ్లకు పరిమిత కాలం వరకు స్టాప్‌‌లు ఏర్పాటు చేశారు. జూలై 19తో ఇచ్చిన సమయం ముగియడంతో ఈ మూడు రైళ్లకు స్టాప్‌లు మళ్లీ ఎత్తివేస్తున్నారు. ఈనెల 19 తర్వాత ఈ స్టేషన్లలో రిజర్వేషన్లు సైతం ఇప్పటికే ఎత్తివేశారు.

మూడు రైళ్లకు మూడు స్టేషన్లలో హాల్టులను ఎత్తివేయడంపై కొందరు ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా స్టేషన్లలో హాల్టులు ఎత్తివేయడంతో సమయం కలిసి రావడంతోపాటు రైలులో రద్దీ కూడా తగ్గుతుందని నేరుగా వెళ్లే ప్రయాణికులు చెబుతున్నారు. కానీ ఈ ఆయా ప్రాంతాల ప్రయాణికులు మాత్రం రైల్వేశాఖ నిర్ణయంపై మండిపడుతున్నారు. హాల్ట్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..