Medaram Jathara: మేడరం భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం రూ. 3 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిధులను మహాజాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే మేడారం జాతర కోసం ప్రత్యేక..

Medaram Jathara: మేడరం భక్తులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు.
Special Trains Medaram

Updated on: Feb 17, 2024 | 12:20 PM

తెలంగాణ కుంభమేళటా పేరుగాంచిన మేడారం సమ్మక్కసారక్క జాతరకు లక్షలాదిగా భక్తులు తరలి వెళుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఇక తెలంగాణ ఆర్టీసీ సైతం మేడారం జాతరకు వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సైతం రూ. 3 కోట్ల నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిధులను మహాజాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఉపయోగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే మేడారం జాతర కోసం ప్రత్యేక రైళ్లను నడుపుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతర జరగనున్న 21వ తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

గిరిజన ప్రజల సంక్షేమం కోరడంలో మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇక ఈ ప్రత్యేక రైళ్ల విషయానికొస్తే.. సిరిపుర్‌ కాగజ్‌గనర్‌-వరంగల్‌ సిరిపుర్‌ కాగజ్‌నగర్‌ (07017/07018), వరంగల్‌-సికింద్రాబాద్‌-వరంగల్‌ (07014/07015), నిజామాబాద్‌-వరంగల్‌-నిజామాబాద్‌ (07019/0720) ప్రత్యేక రైళ్లను నడపున్నారు. ఈ రైళ్లు.. ప్రధాన నగరాలైన సికింద్రాబాద్; హైదరాబాద్‌, సిర్‌పుర్‌ కాగజన్‌ నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగామ, ఘన్‌పూపర్, కామారెడ్డి, మనోహరబాద్‌, మేడ్చల్‌, అలేరు నగరాల మీదుగా వెళ్తాయి.

ఇక మేడారం జాతరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైలు.. ప్రతి రోజు ఉదయం 9:52 గంటలకు బయలుదేరి కాజిపేటకు మధ్యాహ్నం 12:12 గంటలకు, వరంగల్‌కు ఒంటిగంటకు చేరుకుంటుంది. తిరిగి అదే మధ్యాహ్నం 1:55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక మేడారం రైలు మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి, యాదగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, పెండ్యాల్‌, కాజీపేటలో ఆగుతుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ రైలు నడుస్తుంది.

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ మేడారం జాతరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల బస్సులను నడపుంది. వీటి ద్వారా 35లక్షల మంది భక్తులు జాతరకు వెళ్లనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే మేడారంలో 55 ఎకరాల్లో తాత్కాలికంగా ఆర్టీసీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..