Sircilla District: డబ్బుల కోసం తల్లిదండ్రులను కట్టేసిన కొడుకులు.. ఆ ప్రబుద్ధుల చిత్రహింసలతో భయంభయంగా జీవిస్తున్న వృద్ధులు..

Rajanna Sircilla District News: తాము అడిగిన డబ్బులను ఇవ్వలేదని కనిపెంచిన తల్లిదండ్రులకే నరకం చూపించారు ఓ ముగ్గురు ప్రబుద్ధులు. తమకు ఏ మాత్రం మానవత్వం లేదని చాటిచెప్పుకుంటూ ఆ వృద్ధుల పట్ల డబ్బుల కోసం సైకోగా ప్రవర్తించారు. ఇంటి చుట్టుపక్కలవారు వారిస్తున్నా, వారి మాటలను లెక్కచేయకుండా అందరి ముందే.. కొట్టి, కట్టేశారు. అడ్డొచ్చిన మేనల్లుడిని కూడా కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో..

Sircilla District: డబ్బుల కోసం తల్లిదండ్రులను కట్టేసిన కొడుకులు.. ఆ ప్రబుద్ధుల చిత్రహింసలతో భయంభయంగా జీవిస్తున్న వృద్ధులు..
Somanapalli Narsaiah

Edited By:

Updated on: Oct 04, 2023 | 11:15 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 04: తాము అడిగిన డబ్బులను ఇవ్వలేదని కనిపెంచిన తల్లిదండ్రులకే నరకం చూపించారు ఓ ముగ్గురు ప్రబుద్ధులు. తమకు ఏ మాత్రం మానవత్వం లేదని చాటిచెప్పుకుంటూ ఆ వృద్ధుల పట్ల డబ్బుల కోసం సైకోగా ప్రవర్తించారు. ఇంటి చుట్టుపక్కలవారు వారిస్తున్నా, వారి మాటలను లెక్కచేయకుండా అందరి ముందే.. కొట్టి, కట్టేశారు. అడ్డొచ్చిన మేనల్లుడిని కూడా కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో జరిగింది ఈ ఘటన. ఆ ప్రబుద్ధులు ఎంతకీ తమ మాట వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ వృద్ధ దంపతులకు విముక్తి కల్పించారు. అసలేం జరిగిందంటే..

సామనపల్లి పోచవ్వ, నర్సయ్య దంపతులు సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలో తిప్పాపురమ్ గ్రామవాసులు. వీరికి లచ్చయ్య, శంకర్, రాజు అనే ముగ్గురు కొడుకులు. ఇటీవల ఈ వృద్ధ దంపతులకు ఎల్ఐసీ కింద 50 వేల రూపాయలు వచ్చాయి. అయితే ఈ డబ్బు కోసం తల్లిదండ్రులతో గొడవలు పడుతున్నారు కొడుకులు. ఈ క్రమంలోనే తమ మాట వినడం లేదని పరిమితి మీరి ప్రవర్తించారు వారి ముగ్గురి కొడుకులు. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ వృద్ధాప్యంతో కాలం గడుపుతున్న ఆ దంపతులను కొట్టారు. వద్దని వేడుకున్నా ఆ ప్రబుద్ధులు వినలేదు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో తల్లిదండ్రుల కాళ్ళు, చేతులు కట్టేశారు.

వారిని కొట్టవద్దని అడ్డుకోబోయిన మేనల్లుడిని కూడా స్తంభానికి కట్టేశారు. నలుగురు చెబుతున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. స్థానికుల నుంచి విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత కొన్ని రోజులుగా తమను తమ కొడుకులు తీవ్రంగా కొడుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి