Himanshu: పాఠశాల ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ తనయుడి విజయం.. క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ ప్రెసిడెంట్‌గా హిమాన్షురావు

ఇప్పటి నుంచే వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుంటున్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల. స్కూల్‌లో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటాడు.

Himanshu: పాఠశాల ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ తనయుడి విజయం.. క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ ప్రెసిడెంట్‌గా హిమాన్షురావు
Himanshu Rao Kalwakuntla

Updated on: May 08, 2022 | 8:19 PM

Himanshu Rao Kalwakuntla: ఇప్పటి నుంచే వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకుంటున్నారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల. స్కూల్‌లో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటాడు. ఓక్రిడ్జ్ స్కూల్‌లో నిర్వహించిన స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా హిమాన్షు గెలిచారు. క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. విపత్తులు సంభవించిన ప్రాంతాల్లోని బాధితులకు ఆర్ధిక సాయం కోసం నిధులు సేకరించి వారికి అందజేసే బృందానికి హిమాన్షు లీడర్‌గా వ్యవహరిస్తారు హిమాన్షు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్లలో ఇప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓక్రిడ్జ్‌ పాఠశాలలో స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షురావు కల్వకుంట్ల క్రియేటివ్‌ యాక్షన్‌ సర్వీస్‌ (సీఏఎస్‌) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. క్యాంపులు నిర్వహించి, నిధులు సమీకరించి తుఫానులు, వరదలు వచ్చిన ప్రాంతాల్లో సీఏఎస్‌ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతారు. ఈ బృందానికి హిమాన్షురావు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.

ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో ప్రతీ ఏటా స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌ డిప్లొమా ప్రొగ్రాం ఐబీడీపీ -1 చదువుతున్న హిమాన్షు సైతం పోటీచేశారు. హిమాన్షుతోపాటు స్కూల్‌ కెప్టెన్‌గా కే వీరారెడ్డి, స్టూడెంట్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్స్‌గా ఆనన్య ఆనంద్‌ వాస్కర్‌, ఆశిష్‌ గొట్టుముక్కల ఎన్నికయ్యారు. హిమాన్షురావు కల్వకుంట్లతో పాటు కౌన్సిల్‌కు ఎన్నికైన సభ్యులకు స్కూల్ ప్రిన్సిపాల్‌ హేమ చెన్నుపాటి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తొలుత నామినేషన్లు వేసిన విద్యార్థులను ఇంటర్వూ్య చేసిన ఎన్నికల ప్యానెల్‌ చివరికి కొందరిని పోటీకి ఎంపిక చేసింది. పోటీలో ఉన్న విద్యార్థులంతా ఓపెన్‌ ఫోరమ్‌లో తమకు ఎందుకు ఓటు వేయాలో విద్యార్థులకు వివరించారు. ఓట్లను లెక్కించిన పాఠశాల యాజమాన్యం స్కూల్‌ స్టూడెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికల ఫలితాలను ఇటీవలే ప్రకటించింది. శుక్రవారం గెలుపొందిన స్టూడెంట్‌ కౌన్సిల్‌ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ హేమ చెన్నుపాటి హిమాన్షుతో పాటు, కౌన్సిల్‌కు ఎన్నికైన సభ్యలను అభినందించారు.