Telangana: అమ్మకు ప్రేమతో.. సలాం కొడుకా.! అతడు చేసిన పని చూస్తే కన్నీళ్లు ఆగవు..

అమ్మకు ప్రేమతో ఈ వ్యక్తి చేసిన పనికి మనం సలాం కొట్టినా తక్కువే.. ఆకలికి ఆగగలం.. కానీ అమ్మకు ఏదైనా జరిగితే మాత్రం తట్టుకోలేం. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తనకున్న అమ్మ ప్రేమను చాటుకున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: అమ్మకు ప్రేమతో.. సలాం కొడుకా.! అతడు చేసిన పని చూస్తే కన్నీళ్లు ఆగవు..
Mother & Son

Edited By: Ravi Kiran

Updated on: Nov 04, 2025 | 1:06 PM

కడుపు ఆకలి తట్టుకోవచ్చు కానీ.. తల్లి బాధను మాత్రం తట్టుకోలేకపోయాడు ఓ కుమారుడు. నిజామాబాద్‌లో కూలీగా పని చేస్తూ తల్లిని పోషిస్తున్న దీపక్ అనే యువకుడు.. తల్లి బాలమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో జగిత్యాలలోని ఆస్పత్రికి తీసుకువచ్చాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండటంతో బస్సులోనే తల్లిని తీసుకువచ్చాడు. జగిత్యాల బస్టాండ్‌కి చేరుకున్నాక ఆటోడ్రైవర్ రూ.50 అడగగా, జేబులో పైసా కూడా లేకపోవడంతో తల్లిని ఒడిలో ఎత్తుకుని నడవసాగాడు. బస్ స్టాండ్ నుంచి ఆసుపత్రి దగ్గరగానే ఉంది. కానీ రూ. 50 అడగడంతో తనే భుజంపై ఎత్తుకొని తీసుకెళ్లాడు.

ఆ దృశ్యం చూసిన వారందరి హృదయాలు కరిగిపోయాయి. కాస్తా జాగ్రత్త అంటూ చెప్పారు స్థానికులు. తాము సహాయం చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో అటు వైపు వెళ్తున్న ఎమ్మెల్యే డా. సంజయ్ వారిని గమనించి చలించిపోయారు. తన కారులో వారిని ఆస్పత్రికి చేర్చి చికిత్స పూర్తయ్యాక తిరిగి బస్టాండ్ వద్దకు పంపించారు. ఎమ్మెల్యే ఔదార్యానికి స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఏమైనా అవసరం ఉంటే తనకు కాల్ చేయమని అన్నారు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్స్ చెప్పారు.