Father Murder in Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. సైకోలా మారిన కొడుకు.. రాత్రివేళ నిద్రిస్తున్న తండ్రిని..
Father Murder in Nirmal: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే తన తండ్రిని అత్యంత..

Father Murder in Nirmal: తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే తన తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాల్లోని కుచన్‌పల్లి మండల కేంద్రంలో జరిగింది. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కుచన్‌పల్లి కేంద్రానికి చెందిన ఉపేందర్ రెడ్డి, లింగవ్వ దంపతుల చిన్న కుమారు రవి దుబాయ్‌కి వలస వెళ్లాడు. వారం రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. అయితే, దుబాయ్‌లో ఉన్నన్ని రోజులు డబ్బులను అతని తల్లిదండ్రులకు పంపేవాడు. ఇదే అంశంలో తాను పంపిన డబ్బులు ఏవి? అంటూ తల్లిదండ్రులు, తన అన్న రాజుతో గొడవకు దిగాడు. ఈ క్రమంతో రవి.. తన అన్న రాజు ఇంటికి వెళ్లి అతను నిద్రిస్తున్న సమయంలో కత్తితో గాయపరిచాడు. దాంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, మళ్లీ సాయంత్రమే అతన్ని విడుదల చేశారు. అలా ఇంటికి వచ్చిన రవి.. రాత్రి నిద్రిస్తున్న తన తండ్రిని బండరాయితో తలపై కొట్టాడు. ఈ దాడిలో రవి తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం సృష్టించింది. ఉపేందర్ రెడ్డి మృతదేహాన్ని పోలీసు స్టేషన్ ఎదుట పెట్టి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అప్పటికే తన సోదరుడిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేశారంటూ నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే రవీందర్ రెడ్డి చనిపోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన స్టేషన్ ఎస్ఐ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు శాంతించారు. నిందితుడు రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలాఉంటే.. రవి గురించి గ్రామస్తులు సంచలన ఆరోపణలు చేశారు. రవి సైకోలా మారడాని అన్నారు. అతని అరాచకాలు భరించలేకనే రవి భార్య నాలుగేళ్ల క్రితం అతనితో విడాకులు తీసుకుందన్నారు. మూడు సంవత్సరాల క్రితం రవి దుబాయ్‌కి వెళ్లాడన్నారు. అక్కడికి వెళ్లాక కూడా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు. దుబాయ్‌లో పని చేస్తున్న ప్రాంతంలో సహోద్యోగులతో గొడవలకు దిగేవాడన్నారు. సహోద్యోగుల ఫిర్యాదు కారణంగానే రవిని వారం క్రితం ఇంటికి పంపించారని స్థానికులు చెబుతున్నారు. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో రవి నిత్యం ఘర్షణకు దిగేవాడని, మూడు రోజుల క్రితం కూడా రవి తన తల్లి లింగవ్వపై కొడవలితో దాడి చేశాడని తెలిపారు.
Also read:
Fuel prices: పెట్రోల్ ధరలు మేలోపు తగ్గుతాయి.. కీలక కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
