Online Games: కుటుంబంలో విషాదం నింపిన ఆన్‌లైన్ గేమ్స్.. మొన్న కొడుకు.. ఇవాళ తండ్రి ఆత్మహత్య!
బెట్టింగ్ యాప్స్‌లో పెట్టబడులు పెట్టి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్‌పై పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొందరు వాటిని పట్టించుకోకుండా పెట్టుబడి పెట్టి నష్టపోయి, అప్పులపాలై..వాటిని కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పలపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పలపాలై ఆత్మహత్య చేసుకోవడంతో.. కొడుకు మరణాన్ని తట్టుకోలేని తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీనంగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ రావు (21)అనే యువకుడు కొన్నాళ్లుగా ఆన్‌లైన్ గ్రేమ్స్‌కు బానిసయ్యాడు. ఇలా ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి అప్పులపాలయ్యాడు. ఇక వాటిని తీర్చలేక రెండు నెలల క్రితం మానసిక ఒత్తిడితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొడుకు చావును తట్టుకోలేని తండ్రి తిరుపతిరావు తాను కూడా చనిపోదామని రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే తిరుపతిరావు పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండ్రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుమూ మంగళవారం తిరుపతిరావు మృతి చెందాడు.
రెండు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు చనిపోవడంతో వారి కుటుంబ తీవ్ర ఆవేదనకు గురైంది. ఒకే కుటుంబంతో తండ్రి కొడుకుల మరణం ఆ గామంలో విషాదాన్ని నింపింది. అయితే ఇప్పటికే ఎంతో మంది ఆన్లైన్ గేమ్స్ వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావట్లదు. ఆన్‌లైన్ గేమ్స్‌పై పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొందరు వాటిని పట్టించుకోకుండా పెట్టుబడి పెట్టి నష్టపోయి, అప్పులపాలై..వాటిని కట్టలేక ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.
అయితే ఇన్‌ప్లూయెన్సర్లు, సినీ హీరోలు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం వల్లే ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయని కొందరు వ్యక్తులు ఫిర్యాదులు చేయడంతో ఇటీవల సినీ హీరోలు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో బెట్టింగ్ ప్రమోషన్స్‌పై విచారణ జరిపేందుకు సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..