Watch Video: మున్సిపల్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం.. రైన్ కోట్, సబ్బులతో కూడిన స్పెషల్ కిట్లు అందజేత
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్మార్ట్ ఈషా హాస్పిటల్, సంరక్షణ హాస్పిటల్ సౌజన్యంతో..
ఇబ్రహీంపట్నం, జులై 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు, స్వయం ఉపాధి సంఘాల మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్మార్ట్ ఈషా హాస్పిటల్, సంరక్షణ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. మహిళ సంఘాలవారు స్వయంగా తయారుచేసిన ప్రొడక్ట్స్‌కు ఇక్కడ పలు షాపులు ఏర్పాటు చేశారు. అలాగే ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పారిశుద్ధ కార్మికులకు బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు సంబంధించి ఉచిత పరీక్షలు జరిపారు. ఆరోగ్య సమస్యలు నిర్ధారణ అయిన వారికి చికిత్సలను బట్టి మందులు కూడా అందజేశారు. పారిశుద్ధ కార్మికులకు రైన్ కోట్, సబ్బులు ఇతర వస్తువుతో కూడిన కిట్లాను అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ కార్మికులు అనేక మంది పాల్గొన్నారు. వారంతా వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




