Telangana: పేదలకు తీపికబురు.. రేషన్ షాపుల్లో మినీ సిలిండర్లు.. ఇవిగో వివరాలు..
ఇకపై రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులతో పాటు మినీ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
ఇకపై రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులతో పాటు మినీ గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. కనీస నిర్వహణ ఖర్చులు కూడా రాక ఇబ్బందులు పడుతోన్న రేషన్ దుకాణాలు మళ్లీ లాభాల బాట పట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్ట్ లాగ రేషన్ షాపుల్లో మినీ గ్యాస్ సిలిండర్లు, ఇంటర్నెట్ కేఫ్, సిటిజన్ ఛార్జ్ సేవలు వంటి వాటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణలోని నారాయణపేట జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 247 రేషన్ దుకాణాల్లో ప్రస్తుతం బియ్యం మాత్రమే సరఫరా అవుతోంది. తద్వారా డీలర్లకు చాలిచాలనంత కమీషన్ మాత్రమే వస్తోంది. ఈ నేపధ్యంలోనే డీలర్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇకపై రేషన్ దుకాణాల్లో కార్డుదారులతో పాటు ఆధార్ కార్డు ఉన్నవారికి 5 కిలోల గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ నెలా మినీ సిలిండర్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. మొదటిసారి తీసుకుంటున్నవారికి ఒక్కో సిలిండర్ రూ.940కి, తర్వాత నెల నుంచి రూ.620కే అందిస్తామని తెలిపారు. దీనితో రేషన్ డీలర్లు ఆర్ధికంగా లాభాల బాట పడతారని ఆశిస్తున్నారు. అంతేకాదు, రేషన్ దుకాణాల్లో ఇంటర్‌నెట్ కేఫ్‌లు, పౌరసేవా పత్రం ద్వారా 14 రకాల సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది.
Also Read:
ఈ ఫోటోలోని చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
ఈ ఫోటోలో మొదట మీకేం కనిపిస్తోందో.. ప్రపంచం మిమ్మల్ని అలానే చూస్తుంది!
20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!
మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి!! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే!