Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు

| Edited By: Ram Naramaneni

Jul 06, 2024 | 12:48 PM

తెలంగాణలో జోరు వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందం పదండి....

Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు
Telangana Weather
Follow us on

తెలంగాణలో జులై 6, 7 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మాన్‌సూన్ ఎఫెక్ట్‌తో రాష్ట్రమంతటా వర్షాలు ఉంటాయన్నారు. జులై 6 శనివారం…సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి, జగిత్యాల, నిజామాబాద్, సిద్ధిపేట, సిరిసిల్ల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.

వర్షాల సమయంలో.. ఉరుములు, మెరుపులు ఉంటాయని.. 40-50 కి.మీ వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కొన్ని చోట్ల పిడుగులు అవకాశం ఉందని వర్షం పడే సమయంలో ఎవరూ బయట ఉండొద్దన్నారు. ఇక సీటీలోనూ నేడు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ వాఖ తెలిపింది. జులై 8,9,10 తేదీల్లో నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక జులై 5న నగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. అక్కడా, ఇక్కడా అన్ని లేదు అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే జూన్‌లో అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడలేదు. అయితే జులైలో వర్షాలు అధికంగానే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..