అయ్యో పాపం.. ఏడాదికోసారి వచ్చే అతిథులకెంత కష్టం వచ్చిపడింది.. ! వడగండ్లతో కడగండ్లు..

|

Apr 25, 2023 | 7:06 PM

ఈ ఆరు నెలల పాటు గ్రామస్తులు సైతం ఈ పక్షులను అతిధులుగా భావించి వాటికీ ఎలాంటి హాని తల పెట్టకుండా చూసుకుంటారు..ఈ గ్రామంలో పిల్లా పాపలంతా ఆ పక్షులను, వాటి శబ్ధాలను ఆస్వాదిస్తూ మై మరచి పోతుంటారు.. ఈ పక్షులు తమ గ్రామానికి వస్తే కాలమై పంటలు బాగా పండుతాయని, పక్షులు రాకుంటే ఆ యేడు..

అయ్యో పాపం.. ఏడాదికోసారి వచ్చే అతిథులకెంత కష్టం వచ్చిపడింది.. ! వడగండ్లతో కడగండ్లు..
Siberian Birds
Follow us on

ఆ గ్రామానికి అతిథులుగా వచ్చి తెగ సందడి చేస్తున్న వలస పక్షులు వడగండ్ల వానలతో పరేషాన్ అవుతున్నాయి..ఆరు నెలల పాటు చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకొని కనువిందుచేసే ఆ సైబీరియన్ పక్షులు ఈసారి ప్రతికూల వాతావరణంతో మృత్యువాత పడుతున్నాయి. పక్షిపిల్లలను కాపాడుకోవడం కోసం తల్లి పక్షులు పడుతున్న తాపత్రయం చూసిన ప్రజలు అయ్యోపాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న హృదయవిదారక దృశ్యాలు. జిల్లాలోని మాధాపురం గ్రామానికి ప్రతియేటా వలస వచ్చే సైబీరియన్ పక్షులు ఇక్కడే చెట్లపై ఆవాసం ఏర్పరుచుకుంటాయి.. శీతాకాలం జనవరిలో వచ్చి ఆరు నెలలపాటు ఇక్కడే ఉంటాయి.. జూన్ మాసంలో తిరిగి వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయి.

సుమారు రెండు, మూడు కిలోల బరువుతో పెద్ద పెద్ద రెక్కలను చాచుతూ తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు చిత్ర విచిత్ర చప్పుళ్ళతో ఇక్కడి చెట్లపై ముసురుకుంటాయి. ప్రతి సంవత్సరం జనవరి లో తూచా తప్పకుండా విదేశీ కొంగలు ఇక్కడికి వచ్చి చెట్లపై గూళ్ళను అల్లుకొని ఆరునెలల పాటు విడిది చేస్తాయి. గుడ్లను పెట్టి పొదిగిన పిల్లలకు ఎగరడం నేర్పి జూన్ లో వర్షాలు పడే సమయానికి తమ దేశాలకు పిల్లలను తీసుకొని వెళ్లి పోతుంటాయి.. ధశాబ్దాలుగా ఇక్కడకు వస్తున్న విదేశీ పక్షుల్లో ఆస్ట్రేలియాకు చెందిన పక్షులే ఎక్కువగా ఉంటున్నాయి. చుట్టూ పక్కల గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నీటిని , చేపలను తీసుకువచ్చి తమ పిల్లలకు ఆహారంగా అందిస్తూ ఉంటాయి.

ఈ ఆరు నెలల పాటు గ్రామస్తులు సైతం ఈ పక్షులను అతిధులుగా భావించి వాటికీ ఎలాంటి హాని తల పెట్టకుండా చూసుకుంటారు..ఈ గ్రామంలో పిల్లా పాపలంతా ఆ పక్షులను, వాటి శబ్ధాలను ఆస్వాదిస్తూ మై మరచి పోతుంటారు.. ఈ పక్షులు తమ గ్రామానికి వస్తే కాలమై పంటలు బాగా పండుతాయని, పక్షులు రాకుంటే కాలం కాదని ఆ గ్రామస్తుల నమ్మకం.. చుట్టూ ప్రక్కల గ్రామాల నుండే కాకుండా, ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చి ఈ పక్షులను చూసి సంతోషపడుతుంటారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈసారి వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈ పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.. వడగండ్ల వానల ప్రభావంతో చాలా పక్షులు మృత్యువాత పడుతున్నాయి.. పిల్ల పక్షుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం తల్లి పక్షులు తెగ తాపత్రయ పడుతున్నాయి..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..