Telangana: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీస్.. ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు

|

Apr 02, 2024 | 8:03 AM

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝలిపిస్తున్నారు అధికారులు. తాజాగా ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన వారికి షోకాజ్ నోటీసులు చేశారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి. అంతేకాదు ఏకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Telangana: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీస్.. ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు
Ronald Ross
Follow us on

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝలిపిస్తున్నారు అధికారులు. తాజాగా ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన వారికి షోకాజ్ నోటీసులు చేశారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి. అంతేకాదు ఏకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో హైదరాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోని పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 1,2 తేదీలలో రెండు రోజులపాటు 15 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రతిపాదించారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి. తొలిరోజు ఏప్రిల్ 1వ తేదీన 6,000 మందికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయగా అందులో 1,153 మంది సిబ్బంది గైర్హాజరు అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాజ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై సీరియస్ అయ్యారు. గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో శిక్షణ తరగతులకు హాజరు కాని 1,153 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దానితో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధులు పట్ల అలసత్వం వహించిన అధికారులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందని రోనాల్డ్ రోస్ హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..