హైదరాబాద్ లోని పాతబస్తీ చంద్రాయణగుట్ట బార్కాస్కు చెందిన పేరు మోసిన రౌడీ షీటర్ షేక్ సయీద్ బావజీర్ మజ్లీస్ పార్టీ లో కొంతకాలం క్రితం వరకు కార్యకర్తగా చురుకుగా పనిచేసేవాడు. బండ్లగూడ సమీపంలోని ఓ భవనంలో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని ఓ యూ ట్యూబ్ వెబ్ సైట్ ను నిర్వహిస్తున్నాడు. జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన పలు సమస్యలపై సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడుతూ ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తున్నాడు. పలు పార్టీల ప్రముఖ నేతలను ఉద్దేశించి విమర్షలు చేసేవాడు. ఈ నేపధ్యంలోనే తనకు ప్రాణ హాని ఉందంటూ పలు పోలీస్ స్టేషన్ లో పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయితే చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాష్ట్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు.
పేరు మోసిన రౌడీ షీటర్ షేక్ సయీద్ బావజీర్ వెంట భవానీనగర్ కు చెందిన రౌడీషీటర్ అహ్మద్ బిన్ హజబ్ తిరిగేవాడు. అహ్మద్ బిన్ హజబ్ సోదరి వివాహానికి కూడా షేక్ సయీద్ బావజీర్ ఆర్థిక సహాయం చేశాడు. షేక్ సయీద్ బావజీర్ కు అహ్మద్ బిన్ హజబ్కు మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఎక్కడ వెళ్లిన ఇద్దరు కలిసే తిరిగేవారు. ఉన్నట్టుండి గురువారం అర్థ రాత్రి తన కార్యాలయం వద్ద ఉన్న షేక్ సయీద్ బావజీర్ పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బండ్లగూడ పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. బావజీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చాలా కాలం నుంచి స్వలింగ సంపర్కం మోజులో పడ్డ రౌడీ షీటర్ బావజీర్ తన వద్దకు యువకులు తీసుకురావాలని అహ్మద్ బిన్ హజబ్ ను పదేపదే ఒత్తిడి చేసేవాడు. తీవ్ర ఒత్తిడి.. అతని బెదిరింపులు భరించలేక కొంతమంది యువకులను హోమో సెక్స్ కోసం హజబ్ బావజీర్కు దగ్గర పంపించినట్లు సమాచారం. గురువారం రాత్రి కూడా మరో మారు బావజీర్ యువకులను తన వద్దకు పంపాలని బెదిరించాడు. దానికి ఒప్పుకోక పోవడంతో నువ్వే రావాలని రౌడీ షీటర్ బావజీర్ హజబ్పై తీవ్ర ఒత్తిడి చేశాడు. దీంతో తనకు అతనితో ప్రాణ హాని ఉందని భావించిన హజబ్ అదే కత్తితో బావజీర్పై తీవ్రంగా దాడిచేసినట్లు తెలిసింది. పాత బస్తి సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పాత బస్తి వాసులు రౌడీ షీటర్ మృతదేహానికి జాతీయ జండా చుట్టి నివాళులు అర్పించారు. దీంతో జాతీయ జెండాకు అవమానం జరిగిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..