Telangana Politics: నేను పోటీ చేస్తున్నా.. కానీ అంటూ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దాయన

| Edited By: Sanjay Kasula

Oct 08, 2023 | 5:00 PM

Telangana Assembly Elections: సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తన మనసు మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనయులకు రాజకీయ వారసత్వాన్ని అప్పగించి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని తొలుత భావించారు. నాగార్జునసాగర్ నుంచి తనయుడు జై వీర్ రెడ్డి, తనకు పట్టున్న మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డిలను బరిలో దించేందుకు ప్లాన్ చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లిన జానా తనయులు రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు..

Telangana Politics: నేను పోటీ చేస్తున్నా.. కానీ అంటూ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దాయన
Jana Reddy
Follow us on

నల్గొండ, అక్టోబర్ 08: వయోభారంతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించిన రాజకీయ దిగ్గజం.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి తన మనసు మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనయులకు రాజకీయ వారసత్వాన్ని అప్పగించి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని తొలుత భావించారు. నాగార్జునసాగర్ నుంచి తనయుడు జై వీర్ రెడ్డి, తనకు పట్టున్న మిర్యాలగూడ నుంచి రఘువీర్ రెడ్డిలను బరిలో దించేందుకు ప్లాన్ చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లిన జానా తనయులు రాజకీయ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదని.. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని ఒక దశలో జానారెడ్డి తెలిపారు. ఇంతకు ఆ పెద్దాయన అసెంబ్లీకి పోటీ చేస్తారా..? లేక పార్లమెంటుకు పోటీ చేస్తారా.. అన్న కన్ఫ్యూజన్ పార్టీ క్యాడర్ లో ఉండేది.

కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పెద్దాయన మనసు మార్చుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే ఈ ఎన్నికల్లో తన వారసులను రాజకీయ అరంగ్రేటం చేయిస్తున్నానని ఆయన అన్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి జన్మదిన వేడుకలు హాలియాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాడి మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాలియాలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో తనయులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డిలతో కలిసి జానారెడ్డి చేతులెత్తి అభివాదం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ బరిలో ఉంటానని జానారెడ్డి అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నా వారసులను తయారు చేస్తున్నానని చెప్పారు. ప్రజా ఆమోదంతోనే తనయులను రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నానని జానారెడ్డి చెప్పారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని చేసిన తన సవాల్ ను బీఆర్ఎస్, బీజేపీలు స్వీకరించలేదని విమర్శించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ 75 వేల కోట్ల అప్పు చేస్తే.. 9ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 5లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని చెప్పారు.

రైతు బంధు పేరుతో మధ్య తరగతి రైతులకు డబ్బులు ఇస్తూ.. మద్యం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని దుయ్యబట్టారు. ఉప ఎన్నికలో తనను ఓడించడానికి శత విధాల ప్రయత్నం చేసి దగ్గర ఫలితం సాధించారని అన్నారు. ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్.. అని 24గంటల కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని జానారెడ్డి గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం