
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొద్దిరోజుల నుండి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద పులి ఆకారంలో పంట పొలాల మధ్య సంచరిస్తున్న ఒక వింత జీవి అక్కడి ప్రజలకు వెన్నులో వణుకు పుట్టించింది. పులి పొలాల మధ్యకు వచ్చిందని హడలెత్తిపోయిన రైతులు అక్కడి నుండి పరుగులు పెట్టారు. ఓ మహిళ ఆ జీవిని సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, ఊరంతా వైరల్ చేసింది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏం తేల్చారో తెలుసా..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని శివారులో వింత జీవి ఘటన వెలుగు చూసింది. పులి ఆకారాన్ని పోలిన ఒక జంతువు పచ్చటి పంట పొలాల మధ్య సంచరిస్తుంది. అచ్చం పెద్ద పులిఆకారంలోనే ఉండటంతో రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. పెద్దపులి ఆకారంతో పొలాల మధ్య సంచరిస్తున్న ఈ జీవిని చూసి, స్థానిక ప్రజలంతా వణికిపోయారు. సంధ్య అనే ఒక మహిళా రైతు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి గ్రామంలోని గ్రూప్‌లో వైరల్ చేసింది. దీంతో గ్రామ శివారులో పులు సంచరిస్తుందని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పాదముద్ర ఆధారంగా అది పులి కాదు.. చిరుత కాదు.. అడవి పిల్లి అని తేల్చారు. కేవలం అడవిలో సంచరించే జంగా పిల్లి అని గుర్తించారు. అడవి పిల్లి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..