Sankranti School Holidays 2026: రేపట్నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. పెరిగిన హాలిడేస్‌!

సంక్రాంతి పండగ మరో వారం రోజుల్లో రానుంది. ఈ క్రమంలో బడులకు కాస్త ముందుగానే సెలవులు వచ్చాయి. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు రేపట్నుంచే సంక్రాంతి సెలవులు మొదలు కానున్నాయి. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో స్కూల్ పిల్లలు సొంతూళ్లకు వెళ్లేందుకు బారులు తీరారు..

Sankranti School Holidays 2026: రేపట్నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. పెరిగిన హాలిడేస్‌!
Sankranti School Holidays

Updated on: Jan 09, 2026 | 5:27 PM

తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. పట్టణాల నుంచి సొంత ఊర్లకు వెళ్లేందుకు జనాలు బారులు తీరారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వం కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో స్కూళ్లకు సర్కార్‌ ఇచ్చిన సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ ప్రకటన కూడా వెలువడింది. దీంతో విద్యార్ధులకు సెలవులు భారీగానే దక్కాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు స్కూళ్లకు రేపట్నుంచి అంటే శనివారం (జనవరి 10) నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. జనవరి 10 నుంచి జనవరి 16వ తేదీ వరకు మొత్తం 7 రోజుల వరకు సెలవులు వచ్చాయి.

అయితే రేవంత్‌ సర్కార్‌ తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు సంక్రాంతి సెలవులు జనవరి 15వ తేదీతో ముగియనున్నాయి. ప్రభుత్వ క్యాలెండర్‌ ప్రకారం సంక్రాంతి వరకు మాత్రమే సెలవులు వచ్చాయి. అయితే తాజా ఉత్తర్వుల్లో కనుమ పండగ రోజు కూడా సెలవు వచ్చింది. దీంతో సెలవుల సంఖ్య 7 రోజులకు పెరిగింది. తిరిగి పాఠశాలలు జనవరి 17వ తేదీన తెరచుకుంటాయి. అంటే శనివారం నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయన్నమాట. అయితే దూర ప్రాంతాలకు వెళ్లిన వారు శనివారం, ఆదివారం కూడా సెలవులు తీసుకుని మొత్తంగా సోమవారం (జనవరి 18) పూర్తి స్థాయిలో స్కూళ్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

సంక్రాంతి పండగ తెలుగు వారి చాలా ప్రత్యేకం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే యేటా ఈ పండక్కి భారీగా సెలవులు వస్తాయి. మరోవైపు ఏపీలో జనవరి 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. తిరిగి స్కూళ్లు జనవరి 19న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.