పాప సేఫ్.. తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి చిన్నారి

|

May 09, 2019 | 5:20 PM

సంగారెడ్డి చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శివారులో శివనగర్‌లో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బంగారి సంతోష్, శోభ దంపతులు పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీ, బైక్ నెంబర్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 48 గంటల తర్వాత శిశువు తల్లి ఒడిని చేరడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మీడియాకు, పోలీసులకు […]

పాప సేఫ్.. తల్లి ఒడికి చేరిన సంగారెడ్డి చిన్నారి
Follow us on

సంగారెడ్డి చిన్నారి కిడ్నాప్ కేసు మిస్టరీ వీడింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శివారులో శివనగర్‌లో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బంగారి సంతోష్, శోభ దంపతులు పాపను కిడ్నాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీ, బైక్ నెంబర్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 48 గంటల తర్వాత శిశువు తల్లి ఒడిని చేరడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మీడియాకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంగారెడ్డి మండలం కులబ్ గుల్‌కు చెందిన మల్లేశం భార్య పద్మ రెండో కాన్పు కోసం నాలుగు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆడ శిశువుకు జన్మనిచ్చిన పద్మ చిన్నారికి జాండీస్ ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలోనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి శిశువును తీసుకొని వెళ్లిపోయారు.  పాపను కిడ్నాపర్లు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హస్పిటల్ వెనక భాగం నుంచి చిన్నారిని తీసుకెళ్తున్నట్లు దృశ్యాల్లో కనిపించింది. ఆ పాపను కాపాడాలంటూ కుటుంబ సభ్యులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు సంగారెడ్డిలో ఆందోళనలు చేశారు. ఆస్పత్రి భవనంపై దాడిచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లను పట్టించిన వారికి రూ.లక్ష ఇస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. అటు పోలీసులు సైతం రూ.రూ.50వేల బహుమతి ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కామారెడ్డిలో చిన్నారి ఆచూకీ కనుగొన్నారు.