సంగారెడ్డిలో అనూహ్య రితీలో ఓటమి పాలయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి. ఈ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 8217 ఓట్ల మెజార్టీతో గెలిపొందారు. చింతా ప్రభకర్‌కు 83112 ఓట్లు పోలవ్వగా.. జగ్గారెడ్డికి 74895 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీకి అత్యంత కీలకమైన నియోజకవర్గల్లో సంగారెడ్డి (Sangareddy Assembly Election) ఒకటి..1957లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇక్కడ 6 సార్లు కాంగ్రెస్స్ విజయకేతనం ఎగరవేసింది.. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్స్ పార్టీకి అంతంటి ఘన చరిత్ర ఉంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడు సార్లు ఇక్కడి నుండి గెలుపొందారు..సంగారెడ్డి అంటేనే కాంగ్రెస్స్ అనే పేరును తెచ్చాడు. 2018 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జగ్గారెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే..ఎమ్మెల్యే జగ్గారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన్నప్పటి నుండి ఐఐటి(హైదరాబాద్) అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, మీని ట్యాంక్ బాండ్..సంగారెడ్డికి మంజీర నీళ్లు..కొత్త కలెక్టరేట్ ఏర్పాటు అయ్యాయి..అలాగే మదిన గూడా నుండి సంగారెడ్డి వరకు 4 లైన్ రోడ్డు.. సంగారెడ్డి నుండి సదాశివపేట వరకు 4 లైన్ రోడ్డు అందుబాటులోకి తెచ్చారని ఇవన్నీ జగ్గారెడ్డి హయాంలోనే జరిగింది అని అంటున్నారు కాంగ్రెస్స్ నేతలు.
నియోజకవర్గంలో జగ్గారెడ్డికి దీటుగా బీఆర్ఎస్ కూడా తన బలాన్ని పెంచుకుంటూ వస్తుంది..2014 జగ్గారెడ్డిపై పోటీ చేసి గెలిచిన చింత ప్రభాకర్‌ని మళ్ళీ రంగంలోకి దింపింది. చింత ప్రభాకర్ కి చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి పులిమామిడి రాజు బరిలో నిలిచారు. విజయం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను వరించింది.
సంగారెడ్డి నియోజకవర్గంలో మొత్తం నాలుగు మండలాలు సంగారెడ్డి , కంది, కొండాపూర్, సదాశివపేట ఉండగా, సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ముదిరాజులు,రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు.. రెడ్డిలదే పై చేయి. మొత్తం ఓటర్లు: 2,20,160 మంది ఉండగా.. పురుషులు: 1,10,195; మహిళలు: 1,09,961 ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్