Sand Mafia: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో మరింత రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముందే ఒడ్డుపై ఇసుక డంపింగ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వి నిల్వ చేస్తున్నారు. మహాదేవపూర్, పలుగుల క్వారీల్లో టీఎస్ఎండీసీ అధికారులు నియమించుకున్న ప్రయివేటు ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యానికి మించి అధికలోడ్ నింపడం కోసం దర్జాగా వసూళ్లు చేస్తున్నారు. టీఎస్ఎండీసీ ఏంజెంట్ల వసూళ్ల పర్వం టీవీ9 కెమెరాకు చిక్కింది. అధికారుల కనుసైగల మేరకే అధిక లోడ్ చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. లారీలో ఒక్కెట్ అధికంగా నింపడానికకి రూ. 2 వేల నుంచి రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నారు ఈ ఏజెంట్లు.
అయితే, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విస్మయం కలిగిస్తోంది. క్వారిలీ వద్ద బహిరంగంగా దోచుకుంటున్నా.. అధికారులు మాత్రం వాటాలు పంచుకుని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధిక లోడ్ కారణంగా జాతీయ రహదారి కుంగిపోయి భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, తద్వారా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు.
Also read:
TRS vs Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..