ములుగు జిల్లాలో స్యాండ్ మాఫియా(Mulugu sand mafia)బరితెగిస్తోంది. పట్టాభూముల్లో తవ్వకాల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతూ కోట్లు సంపాదిస్తోంది. ఇసుక తవ్వకాలను అరికట్టాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అడ్డుకోవాల్సినవారే సహకరిస్తుండడంతో మాఫియా మరింతగా చెలరేగిపోతోంది. ఏటూరునాగారం శివారు దెయ్యాల వాగులో ఏకంగా ఇసుక క్వారీనే ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. గోదావరి వరద ముప్పు నుంచి గ్రామరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టనూ వదలకుండా భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ తతంగమంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా అడ్డుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇసుకను ఇష్టానుసారంగా తవ్వడం వల్ల భూగర్భజలాలు అడుగంటుతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అక్రమార్కుల తవ్వకాలతో కరకట్ట తెగే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. అదే జరిగితే గోదావరి వరద గ్రామాలను ముంచడం ఖాయమంటున్నారు.
కరకట్ట వద్ద ఇసుక తవ్వకాలపై ఆందోళనకు చేసినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు గ్రామస్థులు. మామూళ్ల మత్తులో ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఇసుక తవ్వకాలను నిలిపి భూగర్భజలాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..
Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?