Raju Family: ఆత్మహత్య కాదు చంపేశారు.. నా కొడుకు అమాయకుడు.. రాజు కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతం..
చిన్నారి చైత్ర హత్యకేసు నిందితుడు రాజు ఈ రోజు ఘట్ కేసర్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణ వార్త టీవీలో చూసిన రాజు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

చిన్నారి చైత్ర హత్యకేసు నిందితుడు రాజు ఈ రోజు ఘట్ కేసర్ వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణ వార్త టీవీలో చూసిన రాజు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రాజు తల్లీ మాత్రం తన కొడుకును పోలీసులే చంపి రైల్వే ట్రాక్ పై పడవేశారని ఆరోపిస్తోంది. రాజు భార్య తన భర్త మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని వేడుకుంటుంది. రాజు స్వగ్రామం అడ్డగుడూర్‌కి రాజు బంధువులు కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజు భార్య మౌనిక.. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని.. ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక కన్నీరుమున్నీరవుతోంది.
రాజు తల్లి తల్లి సైతం పోలీసులను ఆరోపణలు గుప్పిస్తోంది. పోలీసులు అమాయకుడైన తన కొడుకుపై అత్యాచారం కేసు పెట్టి పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తోంది. తన కుమారుడి శవాన్ని తమకు అప్పగించాలని ఆమె కోరుతోంది. రాజు బంధువులు సైతం ఈ నేరాన్ని అతడిపై అన్యాయంగా మోపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న రాజు గురువారం ఉదయం స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కనిపించాడు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్దారించారు. ఈ విషయాన్ని రాజు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి: సైదాబాద్ చిన్నారి ఆత్మ శాంతించింది.. సరిగ్గా వారం రోజులకే రైల్వే పట్టాలపై శవమైన మానవ మృగం
