ఈ యువతకు ఏమైంది! ఎందుకిలా నేరాల బాటపడుతున్నారు! చదువుకోవాల్సిన వయసులో ఈ మర్డర్లేంటి? ఈ స్ట్రీట్ ఫైట్‌లేంటి! అసలు వీళ్లు స్టూడెంట్సా! లేక వీధి రౌడీలా! వరుస ఘోరాలు నేరాలకు అసలు కారణమేంటి? వ్యవస్థలో లోపమా? లేక యువతలో పెరుగుతోన్న నేర ప్రవృత్తా! తెలంగాణలో స్టూడెంట్స్ మర్డర్లు, స్ట్రీట్ ఫైట్స్ కల్లోలం రేపుతున్నాయ్. మొన్న హైదరాబాద్, నిన్న వరంగల్, ఇప్పుడు ఖమ్మం.. గ్యాంగ్ వార్ కలకలం రేపింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టూడెంట్స్ గ్యాంగ్‌వార్ అలజడి రేపింది. దమ్మపేట మండలం మందలపల్లిలో సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్డుపై బీభత్సం సృష్టించారు. సినిమా తరహాలో కాలేజీ బస్సుకు కార్లు, బైక్లను అడ్డుపెట్టి హైవోల్టేజ్ సీన్ క్రియేట్ చేశారు. దమ్ముంటే రారా, నువ్వు మగాడివైతే రారా అంటూ బస్తీ ఫైట్‌కి దిగారు స్టూడెంట్స్. కొంతకాలంగా సీనియర్, జూనియర్స్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ప్రతిరోజూ కాలేజీ బస్సులో ఇరువర్గాల మధ్య మాటా మాటా నడుస్తోంది. ఇప్పుడు సీనియర్‌తో ఓ జూనియర్ దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ మొదలైంది. జూనియర్‌పై సీనియర్లు చేయి చేసుకోవడంతో అది స్ట్రీట్ ఫైట్‌కి దారితీసింది. జూనియర్ తన ఫ్రెండ్స్‌కి ఫోన్‌చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సత్తుపల్లి నుంచి కార్లు, బైక్స్‌పై వచ్చిన అతని స్నేహితులు కాలేజీ బస్సును అడ్డుకొని రణరంగం సృష్టించారు. ఒకర్నొకరు కింద పడేసి కాళ్లతో తన్నుకున్నారు. బండ బూతులు తిడుతూ ఒకరిపై మరొకరు కలబడ్డారు. అసలు వీళ్లు స్టూడెంట్సా? వీధిరౌడీలా అన్నంతగా కొట్టుకున్నారు స్టూడెంట్స్.
కత్తులు, కర్రలు ఒక్కటే తక్కువ, కానీ రౌడీషీటర్లకేమీ తక్కువ కాలేదు స్టూడెంట్స్. ఆ రేంజ్‌లో తన్నుకున్నారు విద్యార్ధులు. చివరికి పోలీసులు వస్తేగానీ స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ కంట్రోల్‌లోకి రాలేదు. చివరికి అందర్నీ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కి తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే, ఓ అమ్మాయి విషయంలో మాటామాటా పెరిగి రెండు వర్గాలు కొట్టుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..