Rythu Bandhu: తెలంగాణ‌లో రైతుబంధు స్కీమ్ కింద రెండు రోజుల్లో రూ.1.669.12 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ

|

Jun 16, 2021 | 8:41 PM

Rythu Bandhu Deposited: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ చేపడుతున్న రైతు బంధు పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం..

Rythu Bandhu: తెలంగాణ‌లో రైతుబంధు స్కీమ్ కింద రెండు రోజుల్లో రూ.1.669.12 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ
Rythu Bandhu Deposited
Follow us on

Rythu Bandhu Deposited: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మ చేపడుతున్న రైతు బంధు పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో సాయం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్న రైతు బంధు సాయం.. రెండు రోజు కూడా జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జమ అయ్యింది. రెండో రోజు 15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1152.46 కోట్లు జమ అయ్యాయి. గురువారం(రేపు) మూడవ రోజు 10.40 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1272.85 కోట్లు జమ కానున్నట్లు వెల్లడించింది. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను 2942.27 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. మూడో రోజు నల్లగొండ జిల్లాకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఇక అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్ల రూపాయలు, ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటు రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును పెంచాలని అన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

ముందుగా ఏ రైతులకు రైతు బంధు అంటే..

కాగా, మొదటి రోజు విడుదల చేసే నిధుల్లో ఎకరంలోపు ఉన్న రైతులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. మరుసటి రోజు నుంచి రోజుకు ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఈ నెల 25 వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఉన్న భూమిలో కొంత అమ్ముకోవడంతో కొత్తగా వాటిని కొన్న వాళ్లు రైతు బంధుకు అర్హత సాధించడంతో యాసంగి కన్నా ఇప్పుడు 2.81 లక్షల మంది రైతులు అదనంగా రైతుబంధు సాయం అందుకోనున్నారు. అలాగే పార్ట్–బీలోనివి పరిష్కారమై పార్ట్–ఏలోకి చేరడంతో కొత్తగా మరో 66,311 ఎకరాలు రైతు బంధు సాయం పొందే వీలు కలిగింది.

ఇవీ కూడా చదవండి:

Bank Charges: మీ ఖాతా నుంచి బ్యాంకులు ఎన్ని రకాల ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా..? పూర్తి వివరాలు తెలుసుకోండి

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!